ఆర్‌ బీఐ గ‌వ‌ర్న‌ర్‌ కు ఆందోళ‌న ఎదురైంది

Update: 2016-12-16 13:26 GMT
పెద్ద నోట్ల రద్దు నిర‌స‌న‌ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ కు ఘాటుగా త‌గిలింది. కోల్‌ కతాకు వ‌చ్చిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ కు స్థానిక‌ ఎన్‌ ఎస్జీ బోస్ విమానాశ్రయంలో కాంగ్రెస్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం - ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ తీరుపై వారు మండిప‌డ్డారు. తిరోగ‌మ‌న నిర్ణ‌యం వ‌ల్ల ప్ర‌జ‌లు రోడ్డు పాలు అవుతున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు.  ఇదిలాఉండ‌గా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆయ‌న‌కు వ్యతిరేకంగా సీపీఎం - అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోల్‌ కతాలోని ఆర్బీఐ కార్యాలయం వద్ద వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బెంగాల్ లెఫ్ట్‌ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బసు మాట్లాడుతూ పాతనోట్ల మార్పిడి గడువు పొడిగించాలన్నారు. తృణమూల్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నుంచి ఆర్బీఐ కార్యాలయం వరకు నిర్వహించిన ప్రదర్శనలో రాష్ట్రమంత్రులు సోవన్‌ దేవ్ చటోపాధ్యాయ - పిర్హాద్ హకీం పాల్గొన్నారు.

మ‌రోవైపు కేంద్ర ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నిర‌స‌న‌ల ప‌ర్వాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశారు.  నోట్లరద్దు ప్రకటన తర్వాత రూ.2000 నోట్లు విడుదల చేయడంతో ఆర్థిక వ్యవస్థలో లోటు తగ్గిందని, ప్రస్తుతం రూ.500 నోట్ల ముద్రణపై ప్రధానంగా దృష్టి పెట్టామని శ‌క్తికాంత దాస్ అన్నారు. 20 - 50 - 100 - 500 - 2000 నోట్ల ముద్రణ కొనసాగుతున్నదని తెలిపారు. సాధారణంగా ఏడాదిలో సరఫరా చేసే 10 - 20 - 50 - 100 నోట్లకు మూడు రెట్ల నోట్లు గత ఐదు వారాల్లో దేశవ్యాప్తంగా పంపిణీ చేశామని,  నోట్ల అవసరం అధికంగా ఉన్న ప్రాంతాలకు విమానాల ద్వారా చేరవేస్తున్నట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు.  గ్రామాల్లో నోట్ల కొరత ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆయా ప్రాంతాలకు పంపిణీకి ప్ర యత్నిస్తున్నామని తెలిపారు.

నోట్ల చలామణిపై మీడియాలో వస్తున్న సంఖ్యలను పరిశీలిస్తున్నామని, ఆర్బీఐతో సంప్రదించాకే స్వయంగా ప్రకటిస్తామని శ‌క్తికాంత దాస్ అన్నారు. ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా ఏటీఎంలను కొత్తనోట్ల పంపిణీకి అనుగుణంగా పునరుద్ధరించామని, కేవలం 13 శాతం ఏటీఎంలు మాత్రమే కొత్తనోట్లను సరఫరా చేస్తున్నాయన్న వార్తలు నిజం కావని కొట్టిపారేశారు. తమకు అందిన ప్రత్యేక సమాచారం ఆధారంగా వ్యక్తులు, ఖాతాలపై నిఘా ఉంచామని, ఆధారాలు దొరకగానే ఐటీ అధికారులు ప్రణాళిక ప్రకారం దాడులు చేస్తున్నారని చెప్పారు. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు నీతిఆయోగ్ పలు ప్రోత్సాహకాలు అందించనున్నద‌ని, డిసెంబర్ 30న ప్రభుత్వం ఏ ప్రకటన చేయబోతున్నదో తనకూ తెలియదని, ఎదురుచూడాల్సిందేనని చెప్పారు. కొత్తగా విడుదలచేసిన రూ.2000 - రూ.500 నోట్ల డిజైన్లు దేశీయంగా రూపొందించినవని, వాటిలో భద్రతా ప్రమాణాలు మరింత పెంచామని శ‌క్తికాంత దాస్‌ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News