రంగులు మార్చుతున్న రంగీళా..

Update: 2019-09-10 12:36 GMT
రంగీళా సినిమా గుర్తుందా.. అదేనండి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్‌ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం రంగీళా. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవ‌రో గుర్తుందా.. గుర్తుండే ఉంటుంది..ఎందుకంటే ఆనాడే త‌న న‌ట‌న‌తో కుర్ర‌కారును స్టెప్పులు వేయించిన ఈమే ఇప్పుడు కాంగ్రెస్ నేత‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ రంగీళా హీరోయిన్ ఇప్పుడు రాజ‌కీయ రంగులు మార్చుతోంది. 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందు ఈ హీరోయిన్ స‌డ‌న్‌ గా కాంగ్రెస్ పార్టీలో చేరింది. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఊర్మిళా మటోండ్క‌ర్ గ‌త ఎన్నిక‌ల్లో ఉత్త‌ర ముంబై నుంచి పోటీ చేసింది.

అయితే అక్క‌డ బీజేపీ సీనియ‌ర్ నేత గోపాల్‌ శెట్టి చేతిలో ఓట‌మి పాలైన ఊర్మిళ ఇప్పుడు రంగులు మార్చేందుకు సిద్ద‌ప‌డింది. అందుకే పార్టీకి రాజీనామా చేసింది. త‌న రాజీనామా ప‌త్రాన్ని ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దియోరాకు అందించింది. వాస్త‌వానికి ఆమే కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ‌లు ఏమి లేవ‌నే చెప్పొచ్చు. కేవ‌లం ఆమే సిని గ్లామ‌ర్ అక్క‌ర‌కు వ‌స్తుంద‌నే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ఆధినాయ‌క‌త్వం కాంగ్రెస్‌ లోకి ఆహ్వానించింది. కేవ‌లం ఏడాది కాలం ఉన్న ఆమెకు ఉత్త‌ర ముంబై పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ టికెట్ ఇచ్చింది. అయితే ఆమె పోటీ చేసిన ప్రాంతంలో కాంగ్రెస్ నేత‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే తాను ఓట‌మి చెందాన‌ని ఆరోపిస్తూ - పార్టీ ఆధినాయ‌క‌త్వం కూడా స‌రైన ద‌శ నిర్దేశం లేకుండా ప‌నిచేస్తుంద‌ని ఆరోపించింది.

త‌న ఓట‌మికి పార్టీలోని వ‌ర్గ‌పోరు ప‌నిచేసింద‌ని, పార్టీలోని అంత‌ర్గ‌త క‌ల‌హాలు - నాయ‌క‌త్వ లోపం - పార్టీ వైఫ‌ల్యంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించారు. న‌టి ఊర్మిళా కాంగ్రెస్ ఆధినాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు చేసి పార్టీకి రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు ఆమె ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ? అనే ఉత్కంఠ నెల‌కొంది. అయితే ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు రాబోతున్న త‌రుణంలో ఊర్మిళ కాంగ్రెస్‌ కు రాజీనామా చేయ‌డం పెద్ద దెబ్బ‌గానే భావిస్తున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. అయితే రాబోవు ఎన్నిక‌లో ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు - అందుకే ఆమే పార్టీ మారిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.


Tags:    

Similar News