అమెరికా: యాపిల్ నుంచి 17 మిలియన్ డాలర్లు దోపిడీ.. భారతీయుడే నిందితుడు

Update: 2022-11-08 13:30 GMT
అమెరికాలో మన వాళ్లు అగ్రస్థానాల్లో ఉండడమే కాదు.. పలు అక్రమాల్లోనూ చేతివాటం చూపిస్తున్నారు. ఇప్పటికే పెళ్లిళ్లు, సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాల పేరిట కన్సల్టెంట్ సంస్థలు స్థాపించి కొందరు భారతీయులు దొరికిపోయారు. ఇప్పుడు ఏకంగా యాపిల్ సంస్థకే కన్నం వేశాడు ఓ భారతీయుడు.  యాపిల్ మాజీ ఉద్యోగి అయిన ఇతగాడు చేసిన పనికి ఏకంగా 17 మిలియన్ డాలర్లు యాపిల్ నష్టపోయింది.

భారతీయ సంతతికి చెందిన యాపిల్ మాజీ ఉద్యోగి ధీరేంద్ర ప్రసాద్ పై కంపెనీని $17 మిలియన్లకు పైగా మోసం చేసినట్లు అభియోగాలు మోపారు. ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

ధీరేంద్ర 2008 -2018 మధ్య యాపిల్ తో కలిసి పనిచేసినట్లు సమాచారం.  ఆ సమయంలో అతను పన్ను ఎగవేత, లంచాలు స్వీకరించడం, తప్పుడు బిల్లులు, దొంగిలించిన భాగాలు , సంస్థ ఎప్పుడూ పొందని సేవలకు బిల్లింగ్ చేసినట్లు అంగీకరించాడు. 52 ఏళ్ల ప్రసాద్ తన సందేహాస్పద కార్యకలాపాలకు నిధులను అందించడానికి షెల్ కంపెనీని కూడా ప్రారంభించాడు. హాన్సెన్ -బేకర్ అనే విక్రేతలు కోర్టు ముందు తన సహచరులని కూడా ప్రసాద్ అంగీకరించాడు.

వేర్వేరు ఫెడరల్ ప్రొసీడింగ్స్‌లో అభియోగాలు మోపబడిన తర్వాత సహ-కుట్రదారులిద్దరూ ఈ భారీ మోసంలో తమ పాత్రను అంగీకరించారు. ప్రసాద్ మార్చి 2023లో విచారణకు హాజరవుతారు. ఆ రోజులోపు అతన్ని అరెస్టు చేయరు. అమెరికా అధికారులు ప్రసాద్ $ 5 మిలియన్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అతడికి 25 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News