సంచలనం రేపిన ఎన్ ఆర్ఐ శశికళ.. ఆమె కుమారుడి దారుణ హత్య ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శశికళను..ఆమెకుమారుడు అనీస్ సాయిలను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అయితే.. వీరి మరణాలకు భర్త నర్రా హనుమంతరావే కారణమని..అతడికి ఒక కేరళ మహిళకు మధ్యనున్న వివాహేతర సంబంధంతోనే భార్య.. కొడుకును హత్య చేసినట్లుగా శశికళ అత్తమామలు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఈమొయిల్ వారు ఒకటి చూపిస్తున్నారు.
ఒక కేరళ మహిళతో తన భర్తకు అక్రమ సంబంధం ఉందంటూ శశికళతన సోదరుడికి ఒక ఈమొయిల్ పంపారు. ఆతర్వాతే ఆమె హత్యకు గురి కావటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇదిలా ఉంటే.. అమెరికా పోలీసులు మాత్రం శశికళ భర్తను విచారించి.. వారి హత్యలలో శశికళ భర్తకు సంబంధం లేదన్న ప్రాధమిక అభిప్రాయానికి వచ్చారు. ఆయనకీ హత్యలతో సంబంధం లేదనే బలమైన ఎలిబీని చూపిస్తున్నారని చెబుతున్నారు.
న్యూజెర్సీలోని బర్లింగ్టన్ లో చోటు చేసుకున్న ఈఘటన పెను సంచలనాన్ని సృష్టించింది. ఇదిలా ఉంటే.. తన భార్య.. కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ హనుమంతరావు పెట్టుకున్న దరఖాస్తుపై అమెరికా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హనుమంతరావును అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతిస్తూ.. బర్లింగ్టన్ ప్రాసిక్యూటర్ అధికారప్రతినిధి జోయెల్ బెవ్లీ వెల్లడించారు.
మరోవైపు అతనికి కేరళకు చెందినమరో మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ స్థానిక ఛానల్ ఒకటి చెబుతోంది. అయితే.. ఆమెకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రావటం లేదు. ఆమెకు కూడా ఇప్పటికే పెళ్లి అయినట్లుగా తెలుస్తోంది. అంత్యక్రియలకువస్తున్న హనుమంతరావు పట్ల శశికళ తల్లిదండ్రులు..వారి బంధువులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు పెద్దప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/