ఒంటెద్దు పోకడలు పోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ మధ్యలో తరచూ ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన తీరుతో సంచనాల మీద సంచలనాలు నమోదు కావటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యన ముస్లిం మెజార్టీ ఉన్న ఏడు దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి రాకుండా నిర్ణయం తీసుకోవటం.. వాటిపై కోర్టులు మొట్టికాయలు వేయటం తెలిసిందే.
అయితే.. కోర్టులు వేసిన మొట్టికాయల్ని లైట్ తీసుకుంటున్న ట్రంప్ తన మొండితనాన్ని ఏ మాత్రం విడిచిపెట్టకుండా అదే పనిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అప్పీళ్లతో పైకోర్టులకు వెళ్లి తన వాదనను సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. అవి కూడా ఆయనకు అనుకూలంగా ఉండకపోవటం గమనార్హం. ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు అమెరికా రాకకు సంబంధించి తీసుకున్న కఠిన ఆంక్షల విషయంలో కోర్టుల నిర్ణయంపై అప్పీల్ కు వెళ్లిన ట్రంప్ కు మరోసారి కోర్టుల నుంచి ఊహించని షాక్ తగిలింది.
తాజాగా ఆయన విధించిన ట్రావెల్ బ్యాన్ ను అమలు చేసేందుకు నో చెబుతూ అప్పీల్ కోర్టు తీర్పు వెల్లడించింది. అప్పీల్ కోర్డు ఇచ్చిన తీర్పుపై అమెరికన్ సివిల్ లిబర్టీస్ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ మాత్రం తాజా పరిణామాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ భద్రతను కోర్టులు పణంగా పెడుతున్నట్లుగా వ్యాఖ్యలు చేసిన ఆయన.. అప్పీల్ కోర్టు తాజా తీర్పుపై తాను సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లుగా ప్రకటించారు. మరి.. అక్కడ కూడా అమెరికా అధ్యక్షుల వారికి మరో మొట్టికాయ పడుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/