చావు పిలుస్తుంటే ఛాయాచిత్రం తీసింది

Update: 2017-05-04 10:09 GMT
నాలుగేళ్ల కిందట  ఆప్ఘనిస్థాన్ లో అమెరికా సైన్యం నిర్వహిస్తున్న లైవ్ ఫైర్ ఎక్సర్ సైజ్ లో ఓ ఆర్మీ ఫొటో గ్రాఫర్ సహా ముగ్గురు మరణించారు.  ప్రమాదవశాత్తు మోర్టార్ ట్యూబ్ పేలడంతో జరిగిన ఈ ఘటనలో హిల్డా క్లేటన్(22) అనే ఆ మహిళా ఫొటో గ్రాఫర్ తాను చనిపోతున్న క్షణాల్లోనూ ఫొటోలు తీశారు.
    
రీసెంటుగా వాటిని బాహ్య ప్రపంచానికి చూపించారు. అమెరికా ఆర్మీకి సంబంధించిన 'మిలటరీ రివ్యూ' అనే పత్రిక మే- జూన్ సంచికలో ఆ ఫొటోలను ప్రచురించారు. బాంబు పేలినప్పుడు వచ్చిన  పెద్ద మంటలు ఆ ఫొటోలో కనపడుతున్నాయి..  ఆ ఫొటోకు సంబంధించిన చిన్నపాటి రైటప్‌ లో క్లేటన్ సేవలను ప్రస్తుతించారు. అఫ్ఘానిస్థాన్‌ లో యుద్ధాన్ని చిత్రీకరిస్తూ ఆమె మరణించారని చెప్పారు.
    
మహిళా సైనికులు కూడా పురుషులతో సమానంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని క్లేటన్ మరణం తెలియజేస్తోందన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో మరణించిన మొట్టమొదటి యుద్ధ డాక్యుమెంటేషన్ మరియు ప్రొడక్షన్‌ స్పెషలిస్టు క్లేటనేనని ఆర్మీ తెలిపింది. క్లేటన్ కుటుంబంతో పాటు ఆమె యూనిట్ కూడా ఫొటోలను విడుదల చేయడానికి అంగీకరించడంతోనే అవి బయటకు వచ్చాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News