ఉగ్రవాదం అండగా రంకెలు వేస్తున్న పాక్ కు ఊహించని షాక్ తగిలింది. ఉగ్రవాదులపై పోరాడేందుకు ఉపయోగించాల్సిన ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత్ పై దాడులకు ఉపయోగించిన పాకిస్థాన్ పై అమెరికా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ విమానాలను దుర్వినియోగం చేయడంపై మరింత సమాచారాన్ని అందజేయాల్సిందిగా పాకిస్థాన్ కు స్పష్టం చేసింది. తమతో కుదుర్చుకున్న వినియోగ ఒప్పందాన్ని (ఎండ్ యూజర్ అగ్రిమెంట్ ను) పాక్ ఉల్లంఘించి ఈ విమానాలను భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించడంతో ఈ సమాచారాన్ని అడిగినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా కశ్మీర్ లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు దిగిన పాకిస్థాన్... ఈ దాడుల కోసం అమెరికాలో తయారైన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రుజువుచేసి పాక్ బండారాన్ని బట్టబయలు చేసేందుకు గురువారం భారత వాయుసేన (ఐఏఎఫ్) సదరు ఎఫ్-16 నుంచి పాక్ పైలట్లు ప్రయోగించిన అమ్రామ్ క్షిపణి భాగాలను బహిరంగపరిచింది. ఈ పరిణామాల గురించి తమకు తెలుసని, ఎఫ్-16 యుద్ధ విమానాల దుర్వినియోగంపై మరింత సమాచారాన్ని అందజేయాల్సిందిగా పాకిస్థాన్ కు స్పష్టం చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అమెరికాతో కుదుర్చుకున్న వినియోగ ఒప్పందాన్ని పాక్ ఇటీవల భారత్ తో ఘర్షణ సందర్భంగా ఉల్లంఘించిందా? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. విదేశాలతో కుదుర్చుకున్న సైనిక విక్రయ ఒప్పందాల్లోని వివరాలను బహిర్గతం చేయరాదన్న నిబంధనల కారణంగా పాక్ తో కుదుర్చుకున్న వినియోగ ఒప్పందాల్లోని వివరాలను వెల్లడించలేమని అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ కోన్ ఫ్లాంక్నర్ పేర్కొన్నారు.
ప్రపంచంలో అత్యాధునిక రక్షణ సామగ్రిని అమ్మే దేశాల్లో అతిపెద్దదైన అమెరికా.. కట్టుదిట్టమైన వినియోగ ఒప్పందాలతో తమ ఆయుధాలను ఇతర దేశాలకు అమ్మడంతోపాటు ఆ ఆయుధాలు దుర్వినియోగమవుతున్నట్టు వచ్చే అన్ని ఆరోపణలను చాలా సీరియస్ గా తీసుకుంటోంది. అయితే ఎఫ్-16 వినియోగ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందా? లేదా? అనే దానిపై నిర్ధారణకు రావడానికి ముందు క్షేత్రస్థాయిలో అమెరికా కొన్ని వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాక్ తన సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు మాత్రమే ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం)కు చెందిన డీఎస్ సీఏ (డిఫెన్స్ సెక్యూరిటీ అండ్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) పేర్కొంది. ఎఫ్-16 యుద్ధ విమానాలను వినియోగించే విషయమై పాకిస్థాన్ కు అమెరికా దాదాపు డజను నిబంధనలు విధించినట్టు బహిరంగంగా అందుబాటులో ఉన్న పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని, రక్షణ సామగ్రిని పాకిస్థాన్‌కు బదిలీ చేయడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అమెరికా చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టు 2006 జులై 20వ తేదీన అప్పటి అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి (సైనిక రాజకీయ వ్యవహారాలు) జాన్ మిల్లర్ అమెరికా పార్లమెంట్ విచారణ సందర్భంగా చెప్పారు. ఈ బదిలీలకు సంబంధించిన చర్చలను రహస్యమైనవిగా పరిగణించడంతో ఆ వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే అమెరికా రక్షణ సామగ్రిని వినియోగించే విషయమై పాకిస్థాన్ కు డజనుకు పైగా నిబంధనలు విధించినట్టు అప్పట్లో ఆయన స్థూలంగా చెప్పారు. కాగా, పాక్ అమెరికా ప్రశ్నకు స్పందించాల్సి ఉంది.