మాయదారి రోగానికి ముందు సక్సెస్.. ఏం జరగనుంది?

Update: 2020-05-19 05:33 GMT
ప్రపంచానికి పెను భారంగా మారి.. ఎప్పుడెప్పుడు మాయదారి రోగం నుంచి బయటపడతామని ఆత్రంగా చూస్తున్న వారందరికి శుభవార్తగా చెప్పాలి. లక్షలాది మంది ఉసురు తీస్తున్న ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు వీలుగా ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేసిన వైనం తెలిసిందే. ఎవరికి వారు పోటాపోటీగా వ్యాక్సిన్ ను డెవలప్ చేసేందుకు వీలుగా పరిశోధనలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అమెరికాకుచెందిన ఒక బయోటెక్ కంపెనీ తాను తయారు చేసిన వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగించింది. దీని ఫలితం సానుకూలంగా ఉండటంతోపాటు విజయవంతం కావటం ఆసక్తికరంగా మారింది. ఎంఆర్ఎన్ఏ 1273 పేరుతో తయారు చేసిన వ్యాక్సిన్ ను తొలిదశలో మనుషుల మీద కొంతమేర ప్రయోగించారు. తాజా ప్రయోగం విజయవంతం కావటంతో.. త్వరలోనే వ్యాక్సిన్ వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల్నికట్టడి చేయలేకపోవటం ఒక ఎత్తు అయితే.. చూస్తుండగానే దేశంలోనూ లక్ష మందికి ఈ మహమ్మారి సోకటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం సదరు అమెరికన్ కంపెనీ పరిశోధన సక్సెస్ అయితే.. ప్రపంచానికి పెద్ద గుదిబండ మీద నుంచి కిందకుదిగినట్లే.
Tags:    

Similar News