300 మిలియన్ డాలర్లతో అదిరిపోయేలా హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్

Update: 2022-10-28 05:31 GMT
అమెరికా అడ్డంకులు తొలిగిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లడానికి కాన్సులేట్ లో అధికారుల కొరత.. సౌకర్యాల లేమీతో వెయిటింగ్ పీరియడ్ నడిచేది. ఆ ఇబ్బందులను తొలగించేందుకు హైదరాబాద్ లో 300 మిలియన్ డాలర్లతో కొత్త భవనాన్ని ఏర్పాటు చేశాడు.
 
14 ఏళ్ల తర్వాత బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో కొత్త ప్రదేశానికి అమెరికా కాన్సులేట్ మారనుంది. ఇది త్వరలో కొత్త ప్రాంగణం ప్రారంభం కానుంది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని సైబరాబాద్- హైదరాబాద్ నడిబొడ్డున ఉంది.ఈ అత్యాధునిక భవనంలో అదిరిపోయే సౌకర్యాలు కల్పించారు. పైగా ప్యాలెస్‌లో కాన్సులేట్ సిబ్బంది తమ చివరి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

కీలకమైన ఉద్యోగుల నియామకంతోపాటు , అమెరికాకు అనుసంధానించబడిన వివిధ అంశాలలో ఈ ప్రాంతానికి అమెరికా కాన్సులేట్ సహాయం చేస్తుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. 2008లో హైదరాబాద్ లో కాన్సులేట్ ప్రారంభించబడింది. కొత్త కాన్సులేట్ ను ఏకంగా $ 300 మిలియన్లతో అత్యాధునికంగా నిర్మించారు. ఇందులోని సౌకర్యాలు విస్మయం కలిగిస్తాయి. సిబ్బంది కోసం 255 డెస్క్‌లు , వీసాలు, పాస్‌పోర్ట్ సేవల కోసం 54 విండోలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలందించనున్నాయి.

ఈ అమెరికా కాన్సులేట్ తో యుఎస్-ఇండియా సంబంధాలు బలోపేతం అవుతాయని యుఎస్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. కాన్సులేట్ సిబ్బంది కొత్త ప్రదేశంలో అమెరికా జెండాను ఎగురవేస్తారని..  రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఎదురుచూస్తున్నారని భావిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News