ఆపరేషన్ చేసినందుకు డాక్టర్ కు 465 ఏళ్ల జైలు శిక్ష ... అసలు ట్విస్ట్ ఇదే !

Update: 2020-11-13 23:30 GMT
పేషెంట్లకు అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసిన ఓ డాక్టర్‌‌ కు యూఎస్‌‌ లోని వర్జీనియా కోర్టు 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సదరు నిందితుడి పేరు డాక్టర్ జావేద్ పెర్వయిజ్. డబ్బుకు ఆశపడ్డ జావేద్ ప్రైవేటుతోపాటు ప్రభుత్వ ఇన్యూరెన్స్ కంపెనీలను మోసం చేశాడు.అనవసరమైన సర్జరీలతో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి లక్షలాది డబ్బులను కొట్టేశాడు. మందులతో తగ్గే అవకాశం ఉన్నా కూడా సర్జరీలు చేసి పేషెంట్స్‌‌ ను బాధకు గురి చేశాడు. గత పదేళ్లలో తన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ‌‌లో 52 మందికి అనవసర సర్జరీలు చేశాడు. వీటిలో ఎక్కువగా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు ఉండటం గమనార్హం.

నీకు అర్జంట్ గా ఆపరేషన్ చేయాలి..లేకపోతే ప్రాణాలకు ప్రమాదం..ఈరోగం క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశాలున్నాయి అంటూ భయపెట్టేస్తాడు. దీంతో భయపడిపోయిన ఆ పేషెంట్లు ఆపరేషన్ చేయించుకునేవారు. అలా 10 సంవత్సరాల్లో 52 మందికి అనవసర ఆపరేషన్లు చేసి భారీగా డబ్బులు గుంజాడు. ఈ విషయాన్ని 29 మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా కోర్టు అతనికి 465 ఏళ్ల జైలుశిక్ష విధించింది. పదేళ్ల కాలంలో పర్వేజ్ 41.26 శాతం ఆపరేషన్లు చేయగా.. మామూలుగా ఇంత వ్యవధిలో డాక్టర్లు 7.63 శాతం మంది పేషెంట్లకు మాత్రమే సర్జరీలు చేస్తారు.

డాక్టర్ జావేద్ డబ్బు కోసం ఆశపడి ఇలా అనవసర ఆపరేషన్లు చేసినట్లుగా తేలింది. ఆపరేషన్ల పేరిట ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల నుంచి లక్షల్లో డబ్బులు రాబట్టుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలగా ఆ సాక్ష్యాధారాలన్నీ కోర్టులో ప్రవేశపెట్టారు. డాక్టర్ చేసి 52 ఆపరేషన్లలో 29 మంది మహిళలకు గర్భసంచి రిమూవ్ ఆపరేషన్ చేశాడు. వీరి ఫిర్యాదుతో డాక్టర్ బాబు జైలుపాలయ్యాడు. పోలీసులు దర్యాప్తులో డాక్టర్ జావేద్ అక్రమాలు నిజమే అని వెల్లడైయ్యాయి. దీనితో కోర్టు 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక మనిషి అన్ని సంవత్సరాలు బ్రతకటమే జరగదు. కానీ ఆ నిందుతుడు చేసిన నేరం అంత తీవ్రంగా ఉందని ధర్మాసనం భావించి అన్ని సంవత్సరాల జైలుశిక్షను విధిచింది.
Tags:    

Similar News