అధ్యక్ష పదవి నుండి ట్రంప్ ను దింపేయడానికి నాన్సీ ‘సవరణ తీర్మానం’ !

Update: 2020-10-10 13:00 GMT
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఆ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించేందుకు యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సన్నద్ధం అవుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ ను పదవి నుండి తొలగించడానికి వీలుగా 25 వ సవరణను ఉపయోగించి ఓ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. ప్రస్తుత అధ్యక్షుడు ప్రజల సేవలో లేదా తన విధినిర్వణహలో విఫలమయ్యాడని ఈ కమిషన్ నిర్ధారించిన పక్షంలో.. దేశ ఉపాధ్యక్షుడే తాత్కాలిక అధ్యక్ష పదవిని చేబట్టేందుకు ఈ సవరణ వీలు కల్పించే అవకాశం ఉంది.

కోవిడ్ బారిన పడిన ట్రంప్..ప్రవర్తనను, ఆయన ఆరోగ్యాన్ని పెలోసీ ప్రశ్నించారు. అసలు మీరు సేవ చేయగల్గుతారా మీ హెల్త్ అందుకు సహకరిస్తోందా , కరోనా చికిత్స అనంతరం మీ ఆరోగ్యం ఎలా ఉంటోంది తదితర సమాచారాన్ని మీ ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంది అని ఆమె అన్నారు. కరోనా వైరస్ చికిత్స పొందిన అనంతరం ట్రంప్ తీరు మరో రకంగా ఉంటోందన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.అయితే ట్రంప్ మాత్రం ఆమెను తప్పు పడుతూ.. జో బైడెన్ ను అధ్యక్షుడిని చేయడానికే మీ నాటకమంతా అని నిప్పులు చెరిగారు.
Tags:    

Similar News