అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా విధానంపై అక్కడి వ్యాపార - పారిశ్రామిక రంగం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. హెచ్-1బీ వీసాల పొడిగింపును అడ్డుకోవడం సరైన నిర్ణయం కాదని - ఇది చాలా చెడ్డ విధానం అంటూ వివిధ రంగాల నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ ఐబీసీ) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైంది కాదని తేలచిచెప్పింది. వర్క్ వీసాపై ట్రంప్ సర్కార్ విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది.
'బై అమెరికన్.. హైర్ అమెరికన్' నినాదంతో ముందుకు వెళ్తూ వర్క్ వీసా నియమాలను ట్రంప్ కఠినతరం చేస్తున్నారు. దీనివల్ల అమెరికాలో భారత్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇక హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారు ఆరేండ్లలోపు గ్రీన్ కార్డు రాకపోతే స్వదేశానికి పంపే ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో యూఎస్ ఐబీసీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
'
'అమెరికాలో ఏళ్లుగా నివాసం ఉంటూ గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న నైపుణ్యం గల వారికి ఇది నిజంగా శరాఘాతమే! ఇది అత్యంత చెత్త నిర్ణయం. బహుశా వారు మళ్లీ అమెరికాకు రాలేరేమో. ఈ విధానం అమెరికా వ్యాపార రంగానికి - ఆర్థిక వ్యవస్థకు దేశానికి ఎంతో హానికరం. ఒక లక్ష్యంతో సాగుతున్న అమెరికన్ వలస విధాన వ్యవస్థకు ఇది విఘాతం కలిగించేది'' అని యూఎస్ ఐబీసీ ప్రతినిధి తెలిపారు.
అమెరికా వీసా చట్టాన్ని సవరించాలంటూ ట్రంప్ చేసిన ప్రతిపాదనలు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతాయని 'బ్లూమ్ బెర్గ్' కూడా పేర్కొంది. దశాబ్దకాలంగా గ్రీన్ కార్డుల కోసం ఎంతో మంది భారతీయులు ఎదురుచూస్తున్నారని వారందరిపైనా పెను ప్రభావం పడుతుందని ఒబామా ప్రభుత్వంలో డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ గా పనిచేసిన లియాన్ ఫ్రెస్కో అభిప్రాయపడుతున్నారు. హెచ్-1బీ వీసా విధానం కఠినతరంతో గ్రీన్ కార్డులు ఆశిస్తున్నవారికీ నిరాశే మిగులనుండగా, 15 లక్షల మంది భారతీయులను ఇది ప్రభావితం చేయనున్నది. కనీసం 5 లక్షలు నుంచి 7.50 లక్షల ఉద్యోగులు భారత్ కు తిరిగి వచ్చే అవకాశాలున్నాయి.