మోడీ ఫ్రెండ్ కి దాడి ఎపిసోడ్ ముందే తెలుసా?

Update: 2016-09-30 07:33 GMT
ఇప్పటివరకూ దేశ ప్రధానులుగా పదవి చేపట్టిన వారు ఎవరూ కూడా అమెరికా అధ్యక్షుడితో అత్యంత సన్నిహితంగా ఉన్నట్లుగా కనిపించరు. టచ్ మీ నాట్ అన్నట్లుగా వారి వ్యవహారం ఉంటుంది. కానీ.. ప్రధాని మోడీ మాత్రం ఇందుకు మినహాయింపుగా చెప్పాలి.  ఒక అమెరికా అధ్యక్షుడు తన పదవీ కాలంలో ఒక దేశాన్ని.. అది కూడా భారత్ లాంటి దేశాన్ని తరచూ సందర్శించిన రికార్డు ఏమైనా ఉందంటే అందుకు మోడీనే కారణమని చెప్పక తప్పదు.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాస్త ఆలస్యంగా అమెరికా అధ్యక్షుడితో మాట కలిపినట్లుగా కనిపించినప్పటికీ.. స్వల్ప వ్యవధిలోనే ఇరు దేశాల అధినేతల మధ్య మంచి సంబంధాలు ఉండటం గమనార్హం. మోడీని తన మంచి స్నేహితుడిగా ఒబామా అభివర్ణించటం చూస్తేనే మోడీ ఆయనకు ఎంత దగ్గరన్న విషయం తెలుస్తుంది. మరి.. మనం తరచూ వినే ఫ్రెండ్ షిప్.. ఫ్రెండ్ షిప్పే.. పేకాట పేకాటే అన్నట్లుగా తాజాగా మోడీ వ్యవహరించారా? అందుకు భిన్నంగా వ్యవహరించారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసేందుకు భారత్ వేసుకున్న ప్లాన్ ను పెద్దన్నకు ముందే చెప్పారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. అమెరికా కళ్లు గప్పి ఆపరేషన్ నిర్వహించటం అసాధ్యమని.. తమకున్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా హాట్ లైన్ లో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడితో సూచన ప్రాయంగా తన ఆలోచనను చెప్పి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కళ్లు గప్పి పని చేసే క్రమంలో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగా సమాచారాన్ని అందించి ఉంటారన్న అభిప్రాయం రక్షణ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. మనకు తెలిసిన పేకాట ఫిలాసఫీకి మోడీ దూరంగా ఉన్నట్లేనని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News