దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మథుర ఘటనను మర్చిపోలేం. నగరం నడిబొడ్డున ఉన్న 280 ఎకరాల పార్కు స్థలాన్ని కబ్జా చేయటమే కాదు.. ఒక ప్రత్యేక వ్యవస్థగా మారటం.. సమాంతర ప్రభుత్వాన్ని నడపటం.. అత్యాధునిక ఆయుధాలతోశిక్షణ ఇవ్వటం లాంటి షాకింగ్ వాస్తవాలు బయటకు రావటం తెలిసిందే.
కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమించిన భూమిని విడిపించే ప్రయత్నం చేసిన పోలీసులపై యుద్ధానికి దిగటం.. ఈ పోరులో జిల్లా ఎస్పీ.. ఒక ఎస్ ఐతో పాటు పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. మథుర ఘటనకు కారణమైన స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రాహి సంస్థ వ్యవహారం విభ్రాంతికరంగా మారింది. గడిచిన రెండేళ్లలో ఈ సంస్థ గురించి ఇంటెలిజెన్స్ 40 సార్లు వార్నింగ్ ఇచ్చిన అఖిలేష్ సర్కారు లైట్ తీసుకుందన్న చేదు నిజం తాజాగా బయటకు వచ్చింది.
అంతేకాదు.. ప్రభుత్వ భూమిని అక్రమించుకొని ఒక కాలనీగా ఏర్పాటు చేసుకున్న చోటును భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మందుగుండు నిల్వలు బయటపడటమే కాదు.. తాజాగా మేడిన్ అమెరికా రాకెట్ లాంఛర్ ఒకటి బయటపడటం సంచలనంగా మారింది. సదరుసంస్థ ఆక్రమించిన జవహర్ బాగ్ లో అధికారులు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఏదో జరుగుతుందన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా విచారణ జరిపితే.. షాకింగ్ నిజాలు చాలానే బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట వినిపిస్తోంది.