ప్రధాని నరేంద్రమోడీకి దీపావళి సందర్భంగా ఊహించని ట్రీట్ ఎదురైంది. దీపావళి సందర్భంగా ప్రధానిహోదాలో ఉన్న మోడీకి అనేకమంది శుభాకాంక్షలు తెలపడం సహజం. దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు, సామాన్యులు ఈ లిస్ట్‌లో ఉంటారు. అయితే ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మోడీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేయడమో లేదా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ట్విట్టర్‌లోనో ఫేస్‌బుక్‌లోనో పోస్ట్ చేసి వదిలేయడమో కాదు. ఒబామా చాలా సర్‌ప్రైజింగ్ విషెస్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ఒబామా దీపావళి సందర్భంగా మోడీకి ఫోన్ చేసి ఆయనకు, భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జీ20 సదస్సు సందర్భంగా టర్కీలో మోడీతో భేటీ అవుతానని పేర్కొన్నారు. ప్రపంచ పెద్దన్న హోదాలో ఉన్న ఒబామా దీపావళిని గుర్తుంచుకొని ప్రత్యేకంగా ఫోన్ చేయడం అంటే నిజంగా సర్‌ప్రైజింగ్ విశేషమే.
బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ ఓటమి, పార్టీ సీనియర్ల అంతర్గత కుంపట్లు, బ్రిటన్ పర్యటన సందర్భంగా ఆ దేశ పర్యటనకు రావొద్దంటూ పలు సంస్థలు నిరసన వ్యక్తం చేయడం... వంటి ఇబ్బందికరమైన పరిణామాల్లో మోడీకి ఈ ఫోన్ మలయసమీరం వంటిదే.