అమెరికా అధ్యక్షుడు బైడెన్ మీడియాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో జరిగిన భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయిన బైడెన్ ఫైర్ అయ్యారు.
సీఎన్ఎన్ కరస్పాండెంట్ కైట్లాన్ కొలిన్స్ బైడెన్ ను ప్రశ్నలు అడుగుతూ.. ''మీ భేటీ తర్వాతైనా పుతిన్ తన ప్రవర్తన మార్చుకుంటారని మీరు భావిస్తున్నారా? ఆ నమ్మకం మీకుందా?'' అని అడిగారు. ఇదే ప్రశ్నను మళ్లీ మళ్లీ అడిగారు. అంతేకాకుండా.. ''సైబర్ దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి పుతిన్ సరైన రీతిలో స్పందిచలేదు కదా.. అలాంటప్పుడు ఇది నిర్మాణాత్మక భేటీ ఎలా అవుతుంది?'' ప్రశ్నించారు.
దీంతో.. బైడెన్ ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యారు. ''ఆయన తన ప్రవర్తన మార్చుకుంటాడని నాకు నమ్మకం లేదు. అయినా.. నేను నమ్ముతున్నానని మీకెప్పుడు చెప్పాను? నేను ఒక వాస్తవాన్ని చెబుతున్నాను. అది మీకు అర్థం కాకపోతే నేనేమీ చేయలేను'' అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇంకా మాట్లాడుతూ.. ''నా ఎజెండా రష్యాకు లేదా మరెవరికీ వ్యతిరేకం కాదు. నా ఎజెండా కేవలం అమెరికన్ ప్రజల కోసమే అని పుతిన్ తో చెప్పాను'' అని అన్నారు. సమావేశం ముగిసిన అనంతరం బయలు దేరిన బైడెన్.. మళ్లీ వెనక్కు వచ్చి రిపోర్టర్ ను కలిశారు. ఆవేశ పడినందుకు సారీ చెప్పారు.