కరోనా వైరస్ లక్షణాలున్న ఓ 15 ఏళ్ల అమెరికా టీనేజర్ తన తల్లిదండ్రులతో కలిసి చెన్నై ఎయిర్ పోర్టుకు రాగా గుర్తించిన అధికారులు వైద్యులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు అతడిని అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తమిళనాడు ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు తెలిపారు.
15 ఏళ్ల బాలుడు ఆదివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో దిగాడు. అతడికి స్క్రీనింగ్ సమయంలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి రక్త నమూనాలు తీసి పరీక్షల కోసం పంపారు. సోమవారం ఇతడికి కరోనా వచ్చిందో లేదో పరీక్షల్లో తేలనుంది.
తమిళనాడు లో కరోనా ఎఫెక్ట్ తో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా రైల్వే కోచ్ లు, బస్సులను క్రిమిరహితం చేయాలని.. మందు స్ప్రే చేయాలని తమిళనాడు రవాణాశాఖ నిర్ణయించింది.
ప్రస్తుతం తమిళనాడు లో 45 ఏళ్ల ఓ వ్యక్తికి మాత్రమే కరోనా సోకింది. అతడికి పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్సనందిస్తున్నారు.