సంచ‌ల‌నం..ఈవీఎంల‌ను హ్యాక్ చేయొచ్చు!

Update: 2018-10-13 12:24 GMT
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో  వీవీపీఏటీ ఆధారిత ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్ల‌ను వినియోగించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల క‌మిష‌న్ పేర్కొంది .

ఇదిలా ఉంటే.. దేశీయంగా అందుబాటులో ఉన్న ఈవీఎంల‌ను హ్యాక్ చేయ‌టం పెద్ద క‌ష్ట‌మేమీ కాదంటూ.. అందుకున్న మార్గాన్ని యూనివ‌ర్సిటీ ఆఫ్ మిచిగాన్ సైంటిస్టులు క‌నుగొన్న‌ట్లుగా పేర్కొంది బీబీసీ న్యూస్‌ రిపోర్టు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. మొబైల్ టెక్ట్స్ మేసేజ్ ల‌తో ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్ల ఫ‌లితాల్ని తారుమారు చేయొచ్చ‌న్న విష‌యాన్ని స‌వివ‌రంగా పేర్కొన‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

మిష‌న్ల వెనుక డిస్ ప్లే ఎలా ఉంటుందో అచ్చం అదే మాదిరి డిస్ ప్లే బోర్డును రూపొందించిన‌ట్టు ఈవీఎంల‌ను హ్యాక్ చేసే ప్రాజెక్టు భాగ‌మైన ప్రొఫెస‌ర్ జే అలెక్స్ హాల్ట్ర‌ర్ మ్యాన్ వెల్ల‌డించారు. ఈ డిస్ ప్లే బోర్డు.. మిష‌ను చూపించే మొత్తం ఓట్ల‌ను కొల్ల‌గొట్టి.. వాటి స్థానంలో వేరేవి చూపించేలా రూపొందించిన‌ట్లుగా చెప్పారు.

అదే రీతిలో ఈవీఎంల‌కు మైక్రోప్రాసెస‌ర్లు  కూడా కూడా జ‌త చేయ‌టం ద్వారా ఓటింగ్ కు.. ఓట్ల కౌంటింగ్ కు మ‌ధ్య ఫ‌లితాల్ని ఏ విధంగా తారుమారు చేయొచ్చ‌న్న విష‌యాన్ని బీబీసీ బ‌య‌ట‌పెట్టింది.

భార‌త ఈవీఎంల‌ను ప్ర‌పంచంలోనే అత్యంత టాంప‌ర్ ఫ్రూప్ ఓటింగ్ మిష‌న్లుగా అభివ‌ర్ణించార‌ని.. ఈ డివైజ్ లో ఉన్న సాఫ్ట్ వేర్ అస‌లు ట్యాంప‌ర్ చేయ‌టానికి వీలు ఉండ‌ద‌ని.. ప్ర‌జ‌లు వేసే ఓట్ల‌ను.. దాని కోస‌మే రూపొందించిన కంప్యూట‌ర్ చిప్స్ లో స్టోర్ చేస్తార‌ని.. దీంతో ట్యాంప‌ర్ చేయ‌టం క‌ష్ట‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

అయితే.. భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ వాడే ఈవీఎంల‌ను హ్యాక్ చేసే వీలుంద‌ని మిచిగాన్ వ‌ర్ఇస‌టీ సైంటిస్టులు తేల్చారు. బీబీసీ క‌థ‌నంతో ఈవీఎంల‌పై అనుమానాలు వ్య‌క్తం చేసే రాజ‌కీయ‌పార్టీల హ‌డావుడి రానున్న రోజుల్లో మ‌రింత ఎక్కువ కావ‌టం ఖాయం. మ‌రి.. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి

Source : BBC
Tags:    

Similar News