ఒక ‘‘సైతాన్’’ను పెద్దన్న లేపేసినట్లే

Update: 2016-11-05 10:29 GMT
మానవత్వం అన్నది లేకుండా.. ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఎంత ప్రమాదకారులో.. తమ ఉగ్రవాద చర్యలతో ప్రపంచంలో హింసాత్మక కార్యక్రమాలు చేపట్టే అల్ ఖైదా అంతే ప్రమాదకరమైనది. ఈ రెండింటి అంతు చూసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్ ఖైదాకు చెందిన ముఖ్య నాయకులు ఫరూక్ అల్ ఖతానిని పెద్దన్న లేపేసిన వైనాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు.

కాబూల్ తూర్పు దిశగా 230 కిలోమీటర్ల దూరంలో కునార్ ఫ్రావిన్స్ లో అక్టోబరు 23న జరిపిన వైమానిక దాడుల్లో అల్ ఖైదా ముఖ్యనేత మరణించినట్లుగా పెంటగాన్ తాజాగా వెల్లడించింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలపైనా.. వారి స్థావరాలపైనా అమెరికా చేస్తున్న దాడుల్లో ఈ ఉదంతం ఒక విజయంగా అభివర్ణిస్తున్నారు.

మరోవైపు..  అల్ ఖైదా మరో నేత బిలాల్ అల్ ఉతాబి సైతం మృతి చెందినట్లుగా చెబుతున్నప్పటికీ పెంటగాన్ మాత్రం ఈ ఉదంతంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోవటం గమనార్హం.  అల్ ఖైదా కీలక నేతల్ని హతమార్చే విషయంలో అమెరికా సాధించిన విజయం ఉగ్రవాదులపై ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలకు లభించిన విజయంగా అభివర్ణిస్తున్నారు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News