కిమ్ కోర‌లు పీకేస్తామంటున్న అమెరికా

Update: 2017-05-04 16:52 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్ట్ ట్రంప్ ను ల‌క్ష్యంగా చేసుకుని నేరుగా మిసైల్ అటాక్ చేస్తామంటూ ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో అమెరికా స్పందించింది. కిమ్ తోక జాడిస్తే.. అత‌నేదైనా బ‌రితెగింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే.. అత‌డికి ఎలా బుద్ధి చెప్పాలో త‌మ‌కు తెలుస‌ని అమెరికా చెప్పింది. కిమ్ హెచ్చ‌రిక‌ల్ని అగ్ర రాజ్యం తేలిగ్గా ఏమీ తీసుకోలేదు. ఈ హెచ్చ‌రిక‌ల‌తో అమెరికా కొంత కంగారు ప‌డ్డ‌ట్లే ఉంది. హెచ్చరికల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఉత్తరకొరియా శక్తి సామర్థ్యాలు, ఆ దేశం తయారు చేసిన అణ్వాయుధాలు, దాడుల తీవ్రత వంటి అన్ని అంశాలపై కులంకషంగా ఈ సమావేశంలో చర్చించింది.

యుద్ధం త‌ప్ప‌నిస‌రైతే ఉత్త‌ర‌కొరియా ప్ర‌య‌త్నాల్ని మొగ్గ‌లోనే తుంచేస్తామ‌ని  అమెరికా మిలిట‌రీ జ‌న‌ర‌ల్ రేమండ్ ఏ థామ‌స్ అన్నాడు. ఉత్త‌ర కొరియాకి చెందిన అణ్వాయుధ‌, క్షిప‌ణి సంబంధిత వెబ్ సైట్ల‌ను ధ్వంసం చేయ‌గ‌ల‌ అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ద‌ళం సిద్ధంగా ఉంద‌ని ఆయన చెప్పాడు. త‌మ స్పెష‌ల్ టీం స‌భ్యులు ప్రపంచంలోని ఏ మూలనున్న వెబ్ సైట్ల‌నైనా సులభంగా ధ్వంసం చేయ‌గ‌ల‌ర‌ని.. వీరు ఇప్పటికే కొరియ‌న్ వెబ్ సైట్ల‌పై ఓ కన్నేసి ఉంచార‌ని అన్నాడు. 80 దేశాల్లో దాదాపు 8000 మందితో తాము ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కోవ‌డానికి సిధ్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించాడు.మ‌రి అమెరికా ప్ర‌క‌ట‌న‌పై కిమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News