మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై ఎవరికి ముందస్తు సమాచారం అంది ఉంటుందన్న ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే చేయటం.. దీనిపై దేశ వ్యాప్తంగా విస్తృతం చర్చ జరగటమే కాదు.. మోడీని అనుమానంగా చూస్తున్న వారూ ఉన్నారు. అయితే.. కేజ్రీవాల్ ను.. ఆయన మాటల్ని ఎంతవరకూ నమ్మొచ్చన్నది తర్వాత విషయమైనా.. మోడీ నిజాయితీ మీద శంక కలిగేలా చేయటంలో మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ప్రధాని తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్ కానీ మమతా బెనర్జీ కానీ.. సీపీఎం నేతలు కానీ ప్రస్తావించని రెండు పేర్లను ప్రస్తావించి కాసింత షాకిచ్చారు తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పద్ద నోట్లను రద్దు చేసిన విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందుగానే తెలుసంటూ తాజాగా ఆయన చేసిన ఆరోపణలు కామెడీ.. కామెడీగా మారాయి.
పెద్దనోట్ల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లు వ్యాఖ్యానించిన ఉత్తమ్ అండ్ కో.. మోడీ సర్కారు నిర్ణయంపై నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్.. ప్రధాని మోడీ తనకు అనుకూలమైన ముఖ్యమంత్రులు.. తన సన్నిహితులతోపాటు.. కొన్ని వ్యాపార సంస్థలకు పెద్దనోట్ల లీక్ వ్యవహారాన్ని ముందుస్తుగానే వెల్లడించినట్లుగా ఆరోపించారు.
ఒకవేళ ఉత్తమ్ మాట నిజమే అనుకున్నా.. ఏపీ ముఖ్యమంత్రి బాబుతో మోడీకి కాస్తోకూస్తో రిలేషన్ ఉంది కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రితో అంత సన్నిహిత సంబంధాలు లేవనే విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ.. ఎవరికి తెలీని దగ్గరతనం వారిద్దరి మధ్య ఉందని అనుకున్నా.. మోడీ నిర్ణయం తీసుకున్న వెంటనే.. తాను నమ్మే పరివారం మొత్తాన్ని గవర్నర్ దగ్గరకు తీసుకెళ్లి.. అక్కడ భేటీ పెట్టుకున్న కేసీఆర్ తీరు చూసినా.. ఆ సందర్భంగా మోడీ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైనానికి సంబంధించిన వార్తలు చూసినా.. రద్దు నిర్ణయం ఆయనకు ఊహించని భారీ షాక్ కు గురి చేసిందన్న భావన కలగటం ఖాయం. ఇదిలా ఉంటే.. అందుకు భిన్నంగా ఉత్తమ్ చేసిన ఆరోపణలు చిన్నపిల్లల మాటల్లో అనిపించటంలో సందేహం లేదు. కీలక అంశాలపై విమర్శలు.. ఆరోపణలు చేసే సమయంలో కాసింత లాజిక్ ఉండేలా చూసుకోవాలన్న విషయాన్ని ఉత్తమ్ కు చెప్పాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/