స‌బిత కోసం ఆఖ‌రి ప్ర‌య‌త్నం...

Update: 2019-03-11 06:09 GMT
కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముందు  కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రోజుకో ఎమ్మెల్యే చొప్పున ఆ పార్టీకి గుడ్‌ బై చెప్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ను వీడగా.. మరో ఇద్దరు కేసీఆర్ నాయకత్వంలో నడవాలని నిర్ణయించారు. తున్నది. 19 మంది ఎమ్మెల్యేలలో ఆ పార్టీలో ఎంతమంది కొనసాగుతారో ఆగ్రనాయకత్వానికే తెలియని పరిస్థితి నెలకొన్నది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు - ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు - నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇప్పటికే కాంగ్రెస్‌ కు వీడ్కోలు పలికారు. పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ఆదివారం ప్రకటించారు. ఇలావుండగా, మహేశ్వరం ఎమ్మెల్యే - మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం కేటీఆర్‌ తో భేటీఅయినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ అల‌ర్ట్ అయింది.

పార్టీ సీనియ‌ర్ నేత‌ - మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ ను వీడనున్నారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. ఆదివారం ఉదయం టీఆర్‌ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో సబితాఇంద్రారెడ్డి - ఆమె కుమారుడు కార్తీక్‌ రెడ్డి భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. దీంతో ఆమెను బుజ్జగించేందుకు ఆ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - సీఎల్పీనేత భట్టి విక్రమార్క - సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి.. సబిత ఇంటికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. పార్టీని వీడొద్దని - భవిష్యత్‌ లో మంచి అవకాశాలు ఉంటాయని వారు వివరించారు. అయితే, ఆమె నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో నాయకులు నిరాశతో వెనుదిరిగినట్టు తెలిసింది.
Tags:    

Similar News