తెలంగాణలో అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ ముందస్తు ఎన్నికలపై మాట్లాుడుతున్నాయి. ఎవరికి వారు ప్రజలు తమవైపే ఉన్నారని జబ్బలు చరుచుకుంటున్నారు. దమ్ముంటే ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలు అన్ని పార్టీలకు కలిపి 20 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ చెప్పినప్పటి నుంచి ముందస్తు లెక్కలు మొదలైపోయాయి. దీనిపై కాంగ్రెస్ ఘాటుగానే స్పందించింది. ముందస్తు దాకా ఎందుకు? మీ పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలు 24 మంది చేత ముందు రాజీనామా చేయించాలని సూచించింది. తిరిగి వారిని గెలిపించుకుంటే మీకు ప్రజాబలం ఉందని అంగీకరిస్తామని సవాలు విసిరారు. కేసీఆర్ సవాలు వివరాలన్నీ తప్పుల తడక అని ఆరోపించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. తమ పార్టీకి 80 సీట్లు వస్తాయి అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చేశారు.
మరోవైపు అన్ని నియోజకవర్గాలకూ అభ్యర్థులు దొరుకుతారో లేదో తెలియని టీడీపీ కూడా ముందస్తు మంత్రం జపిస్తోంది. వారి మాటలు కేవలం కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు చేస్తున్నవనే అనుకోవాలి. అసలుపార్టీ ఉందో లేదో తెలియకుండా ఉన్న పార్టీ ముందస్తు గురించి మాట్లాడటాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇకపోతే కమ్యూనిస్టులు ఈ విషయంలో కేసీఆర్ కు బాగానే చురకలు అంటిస్తున్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతే.. 2004లో చంద్రబాబు కంటే దారుణంగా నేలకరుస్తారని తాజాగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. ముందస్తు ఆలోచనలు మానేసి ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. మొత్తానికి ముందస్తు అంచనాలు మాటల వేడిని బాగానే పెంచుతున్నాయి.'
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/