కేసీఆర్ హామీల్లో ఉత్త‌మ్ భ‌లే లాజిక్ ప‌ట్టేశారే?

Update: 2017-11-10 17:24 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల హామీలు, మైనార్టీ సంక్షేమంపై ఆయ‌న చూపుతున్న చొర‌వపై తెలంగాణ‌ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన లాజిక్ పాయింట్ తెర‌మీద‌కు తెచ్చారు. ముస్లింల సంక్షేమం విష‌యంలో సీఎం కేసీఆర్ చెప్తున్న‌ది ఒక‌టి..చేస్తున్న‌ది మరొక‌ట‌ని ఉత్త‌మ్ ఆరోపించారు. మైనార్టీ రిజ‌ర్వేష‌న్ విష‌యంలో గతంలోనే కాంగ్రెస్ 5 శాతం ఇవ్వాల‌ని భావించి 4 శాతం అమల్లోకి తెచ్చింద‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఫ‌లితం వ‌ల్ల‌...10 లక్షల పేద ముస్లింల‌కు రిజ‌ర్వేషన్స్ ఫలాలు అందాయని ఆయ‌న వివ‌రించారు. అయితే టీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తెరాస అధికారంలోకి రాగానే 4 నెలల్లో రిజర్వేష‌న్‌ అమలు చేస్తామని ప్ర‌క‌టించార‌ని అయితే...40 నెలలు అయినా ఒక్క ముస్లింకు కూడా ఆ రిజ‌ర్వేష‌న్‌ ఫలం అందలేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వివ‌రించారు.

అసెంబ్లీలో మరోసారి.. ముస్లింల‌ను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. ముస్లింల‌కు 12 శాతం రిజ‌ర్వేషన్ విష‌యంలో కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చిందని  తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో మాట్లాడాన‌ని పేర్కొంటూ ఆయ‌న‌ ఒప్పుకుంటారు చెప్తున్నార‌ని...ఒక‌వేళ ఒప్పుకోక‌పోతే సుప్రీంకోర్టు వెళ్లాన‌ని ప్ర‌క‌టించ‌డం అంటే... మోసం చెయ్యడానికి రంగం సిద్ధం చేసుకుంటుండ‌ట‌మేన‌ని అంటున్నారు. మోడీ-కేసీఆర్ ఏం మాట్లాడారో తెలియ‌దు కానీ...బీజేపీ వ్యతిరేకం అని స్పష్టం చేసింద‌ని గుర్తుచేశారు. బీజేపీ ముస్లింల రిజ‌ర్వేషన్ల‌కు వ్యతిరేకం అంటున్న నేప‌థ్యంలో బీజేపీ వేరు..మోడీ వేరా అని ఉత్త‌మ్ సూటిగా ప్ర‌శ్నించారు. సీఎం చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇవ్వని మిషన్ భగీరథ పూర్తి చెయ్యకపోతే వ‌చ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని ప్ర‌క‌టించిన కేసీఆర్‌...గత ఎన్నికల్లో ముస్లింలు, గిరిజనులకు ఇచ్చిన హామీ నెలబెట్టుకోలేకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగా అనే దమ్ముందా అంటూ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు.

బీసీఈ రిజ‌ర్వేష‌న్‌ను జనాభా ప్రాతిపదికన పెంచితే.. మిగిలిన బీసీ-ఏ,బీ,సీ,డీ కూడా జనాభా ప్రాతిపదికన పెంచమంటే సీఎం కేసీఆర్ స్పందించ‌డం లేద‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌ప్పుప‌ట్టారు. గిరిజన రిజ‌ర్వేషన్ విష‌యంలో కూడా కేసీఆర్‌ మాటలతో టైం పాస్ చేస్తున్నాడని ఉత్త‌మ్ మండిప‌డ్డారు. వక్ఫ్ బోర్డుకి జ్యూడిషియల్ పవర్ ఇస్తా అని చెప్పిన కేసీఆర్‌ ఇప్పటి దాకా దాన్ని అమ‌ల్లో పెట్టలేద‌ని వివ‌రించారు. 3 ఏళ్ల‌లో హజ్ కమిటీ - మైనారిటీ కమిషన్ - ఉర్దూ అకాడమీ దేనికి కమిటీ లేదని త‌ద్వారా ముస్లింలు త‌మ ప్ర‌యోజ‌నాలు పొంద‌లేద‌ని ఉత్త‌మ్ వివ‌రించారు. సుధీర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏడాది అయినా కూడా చర్యలు లేవని ఆయ‌న వివ‌రించారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన 4 శాతం రిజర్వేష‌న్ అమ‌లును కేవలం 58 రోజుల్లో ఆచ‌ర‌ణ‌లో చూపించామ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వివ‌రించారు. సీనియర్ లీడర్ల మీటింగ్ తర్వాత మజ్లీస్ మీద త‌మ విధానం ప్రకటిస్తామని ఆయ‌న తెలిపారు.
Tags:    

Similar News