కేసీఆర్‌ కు నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు ఇచ్చిన ఉత్త‌మ్‌

Update: 2016-10-31 10:52 GMT
ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా ఎన్నో స‌ర్వేల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు టాప్ మార్కులు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల ప‌రంగాను - పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డంలోను - పారిశ్రామిక ప‌రంగాను ఎన్నో స‌ర్వేలు వ‌చ్చాయి. వాట‌న్నింటిలోను కేసీఆర్‌ కే టాప్ మార్కులు వ‌చ్చాయి. రెండు రోజుల క్రితం దేశంలో టాప్ ప్లేస్‌ లో ఉన్న సీఎం ఎవ‌రు అన్న స‌ర్వేలో కేసీఆర్ ఫ‌స్ట్ ర్యాంకు ద‌క్కించుకున్నారు. ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే మ‌ళ్లీ కేసీఆరే గెలుస్తార‌ని కూడా స‌ర్వేలు చెప్పాయి. ఇక సోమ‌వారం తాజాగా ప్రపంచ బ్యాంకు - డిపార్ట్‑మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ)  విడుదల చేసిన జాబితాలో సైతం తెలంగాణ అత్యంత తేలికగా వ్యాపార నిర్వ‌హ‌ణ చేసుకునే రాష్ట్రాల్లో ఫ‌స్ట్ ప్లేస్‌ లో నిలిచింది. ఇవ‌న్నీ కేసీఆర్ పాల‌న‌కు చాలా చాలా ప్ల‌స్ అన్న టాక్ వ‌స్తోంది.

ఇదిలా ఉంటే కేసీఆర్‌ కు జాతీయ స్థాయిలో అన్ని స‌ర్వేలు టాప్ ర్యాంకులు ఇస్తుంటే తెలంగాణ‌లో ఉన్న విప‌క్షాలు మాత్రం ఆయ‌న్ను ఓ రేంజ్‌ లో ఆడుకుంటున్నాయి. ఈ స‌ర్వేల‌న్ని బోగ‌స్ అని కొట్టి ప‌డేస్తున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డి కేసీఆర్ పాల‌న సూప‌ర్‌ అంటూ వ‌స్తోన్న స‌ర్వేల‌న్ని బోగ‌స్ అని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. సోమ‌వారం దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి - మాజీ హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ జయంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌ లోని గాంధీభ‌వ‌న్‌ లో వారి చిత్ర‌ప‌టాల వ‌ద్ద టీ పీసీసీ నేత‌లు వారికి ఘ‌నంగా నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ కు అప్పులు - అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌లు - ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డం త‌దిత‌ర అంశాల్లో ఫ‌స్ట్ ర్యాంకు ఇవ్వాల‌ని ఎద్దేవా చేశారు. ఇక జీహెచ్ ఎంసీలో కూడా కోట్లాది రూపాయ‌ల అవినీతి జ‌రుగుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇత‌ర పార్టీల నుంచి టీఆర్ఎస్‌ లో చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయించ‌డం లేద‌ని ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు. మ‌రి ఉత్త‌మ్ విమ‌ర్శ‌ల‌పై కేసీఆర్ అండ్ కో ఎలా రిప్లే ఇస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News