జేఏసీ బ‌ల‌హీన‌ప‌డిందంటున్న ఉత్త‌మ్‌

Update: 2017-01-24 07:08 GMT
టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేసే బదులుగా విపక్షాల‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భావిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. తాజాగా ఆయ‌న  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్ర‌క‌టించారు. టీఆర్ ఎస్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఎవరూ ఉద్యమాలు చేసిననా తమ పార్టీ మద్దతు ఇస్తోందని, అందులో భాగంగానే  తాజా మ‌ద్ద‌తు అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పారు. తమ్మినేని రాష్ట్ర వ్యాప్తంగా 4వేల కిలో మీటర్ల పాదయాత్ర చేయడం సాహసోపేత నిర్ణయమన్నారు. నల్లగొండ జిల్లాలో మహాజనపాదయాత్రకు ఘనస్వాగతం పలుకుతామని, తాను కూడా పాల్గొటానని చెప్పారు. గాంధీభవన్‌ లో ఇష్టాగోష్టిలో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజేఏసీ కొంత బలహీనపడింద‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. జేఏసీ చైర్మ‌న్ కోదండరాం కొత్త పార్టీ పెట్టే అవకాశం లేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కొంత మంత్రి నాయకులు మాత్రం పార్టీ పెట్టాలని ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ఐదురాష్ట్రాల ఎన్నికల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో విద్య-నిరుద్యోగంపై సదస్సు నిర్వహిస్తామని దీనికి రాహుల్‌ గాంధీ ఆహ్వానిస్తామని ఉత్త‌మ్ అన్నారు. సింగరేణి - ఐటీఐఆర్‌ - ఇందిరాగాంధీ శతజయంతి వేడుకలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను వేయనున్నట్టు తెలిపారు. 27న హైదరాబాద్‌ లో నోట్ల రద్దుపై జనవేదన సదస్సు నిర్వహిస్తున్నామని, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఈ నెల 29న జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్నారని, ఆ సందర్భంగా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతారని, అదే రోజు రంగారెడ్డి జిల్లాలో జరగనున్న బహిరంగ సభలో చిదంబరం ప్రసగిస్తారని తెలిపారు. ఈ నెలాఖరులో బెంగళూర్‌ నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో వారం రోజుల పాటు చికిత్స తీసుకోనున్నట్టు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు.

జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులకు తీవ్రమైన పోటీ నెలకొందని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. మంచిర్యాల - సంగారెడ్డి - రంగారెడ్డి - మెదక్‌ - ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షులపై ఏకాభిప్రాయం లేదన్నారు. రాహుల్‌ ఆదేశాల ప్రకారం జిల్లా అధ్యక్షులు ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఉంద‌ని పేర్కొంటూ ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి అధ్యక్షులను నియమిస్తామన్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి నాలుగు రైదురురు పోటీ పడుతున్నారని, వారిలో ఒకరిద్దని ఎంపిక చేసి అధిష్టానానికి పంపిస్తామన్నారు. ఇటీవల కాంగ్రెస్‌ బృందం ఢిల్లీ వెళ్లినప్పుడు రాహుల్‌ గాంధీని కలిశామని, టీపీసీసీ ప‌నితీరు ప‌ట్ల ఆయన సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News