కేసీఆర్ ఓ బందిపోటు..ఆయ‌న‌వి లుచ్చా మాట‌లు

Update: 2017-02-25 13:38 GMT
కేసీఆర్ కుటుంబం బందిపోట్ల ముఠా వంటిద‌ని, కమీషన్ ల కక్కుర్తి కోసం కేసీఆర్ అప్పులు చేస్తున్నారని పీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  మండిప‌డ్డారు. కేసీఆర్ లుచ్చా మాటలు మాట్లాడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. సన్నాసులు తాము కాదు కాంగ్రెస్‌ వారేన‌ని మండిప‌డ్డారు. స్వంత డబ్బులతో దేవుడికి మొక్కులు తీర్చుకోమంటే తప్పా అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ మిగులుకు కాంగ్రెస్ కారణమ‌ని, కేసీఆర్ ప్రభుత్వం ఒక్క యూనిట్ ఉత్పత్తి చేయలేదని తెలిపారు. తాము కట్టిన ప్రాజెక్టులకు స్విచ్ లు ఆన్ చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఉత్త‌మ్ చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో దోపిడీ చేస్తానంటే కాంగ్రెస్ ఊరుకోద‌ని స్ప‌ష్టం చేశారు.

కేసీఆర్‌వి నీచమైన దిగజారుడు రాజకీయాలని, నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడటం కేసీఆర్ నైజమ‌ని మండిప‌డ్డారు. ప్రభుత్వం ఆర్భాటాలు తప్ప.. ఎక్కడ పని జరగడం లేదని చెప్పారు. కేసీఆర్ కోట్లతో ఇల్లుకట్టుకుంటాడు..కోట్ల రూపాయాలతో చార్టెడ్ విమానాల్లో విలాసాల‌కు తిరుగుతుంటారు కానీ సామాన్యుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోర‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ లో కాంగ్రెస్ పై చేసిన కామెంట్లపై గద్వాల ఎమ్మేల్యే డీకే అరుణ  కేసీఆర్ మీద మండిప‌డ్డారు. కేసీఆర్ కుటుంబమే ఒక దోపిడీ దొంగల కుటుంబ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ కాంట్రాక్టర్ల మోచేతి నీళ్లు త్రాగుతూ తెలంగాణను దోచుకుంటున్నార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణ కి ముఖ్యమంత్రి కాదు కదా చెప్రాసీవి కూడ అయ్యే వాడు కాదని వ్యాఖ్యానించారు. "నీ స్వంత డబ్బులతో మొక్కులు తీర్చుకో ప్రజాదనంతో కాదు. ఖబర్దార్ ముఖ్యమంత్రి నీ నోరు అదుపులో పెట్టుకో. సెంటిమెంట్ ఓట్ల రాజకీయాలు మానుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయ్. ఎస్సీ ముఖ్యమంత్రి ,ఎస్సీల మూడు ఎకరాల హామీ చిల్లర ఓట్ల కోసం కాదా? ముస్లీంల 12% రిజర్వేషన్, ఏస్టీలకు 12% రిజిర్వేషన్ , ఇంటింటికి ఉద్యోగం , రెండు బెడ్ రూములు చిల్లర ఓట్ల కోసం కాదా?  నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాఢటానికి నీ అబ్బసొత్తు కాదు తెలంగాణ అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే  ఇక్కడ పడేవార ఎవరు లేరు నాలుక‌ కోస్తారు ఖబడ్దార్?"  అని హెచ్చ‌రించారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోక పోతే నీకు తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పుతారని హెచ్చ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News