టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల పరిపాలన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్ షీట్ విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ చార్జ్ షీట్ ను జూన్ 1న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతులు-విద్యార్థులు-నిరుద్యోగ యువకులు-ఉద్యోగులు-వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు టీఆర్ ఎస్ పాలనతో విసుగు చెందారన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై సైతం చార్జ్ షీట్ ను విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
జూన్ 1న సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియం గ్రౌండ్ లో తెలంగాణ ప్రజా గర్జన సభ నిర్వహించడం సీఎం చంద్రశేఖర్ రావు సొంత జిల్లా నుంచే ఆయన ప్రభుత్వ వైఫల్యాలపై యుద్ధం ప్రకటిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించే నిమిత్తం ఈ సభను వేదికగా చేసుకున్నట్లు వివరించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్న హామీని తొలిరోజే విస్మరించారని, దళితులకు మూడెకరాల భూమి, ప్రతి ఇంటికో ఉద్యోగం, లక్ష రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తానని వాగ్దానం చేశారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా రైతుల రుణాలపై ఉన్న వడ్డీని ప్రభత్వమే మాఫీ చేస్తుందని చెప్పి ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదన్నారు. ఫలితంగా బ్యాంకులు రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, మిర్చి, కంది, వరి రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులకు క్వింటాల్ కు 1500 రూపాయల బోనస్ ఇస్తున్న విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక కూడా వరికి క్వింటాల్‌కు 200 రూపాయల బోనస్‌ను బడ్జెట్‌లో కేటాయిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ప్రజల, రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదన్నారు. దేశంలో అత్యధిక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం తెలంగాణే అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నివేదికలో పేర్కొం దన్నారు. మూడేళ్లలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. విద్యార్థుల, యువకుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆయా వర్గాలకే దిక్కులేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన కంటే కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కే చంద్రశేఖర్ రావులు అద్భుతమైన పాలన అందిస్తారని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారన్న ఆశతో ఓట్లు వేసి గెలిపిస్తే వారు ప్రజా వంచనకు పాల్పడ్డారని విమర్శించారు. యువత తీవ్ర నిరాశతో ఉందని, 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/