బాబును ఫాలో అవుతున్నావేంటి ఉత్తమ్.

Update: 2017-01-25 07:03 GMT
మాటంటే మాటే అని చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రా కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే వరకూ తన గడ్డాన్ని తీయనని ఆ మధ్యన చెప్పటం.. దానిపై చాలానే జోకులు పేలటం తెలిసిందే. అయినప్పటికీ.. తాను చేసిన శపధం విషయంలో వెనక్కి వెళ్లేదేలేదని తేల్చిచెబతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో కేసీఆర్ కు ఎదురు లేదన్న వాదనను ఉత్తమ్ అస్సలు ఒప్పుకోవటం లేదు. అలెడ్రీ తెలంగాణ రాష్ట్ర పతనం షురూ అయ్యిందని ఆయన నమ్మకం చెబుతున్నారు. అదెలా అంటే.. ప్రజా వ్యతిరేక విధానాల్ని కేసీఆర్ సర్కారు అమలు చేస్తుందని..ఈ విషయంలో తెలంగాణ ప్రజానీకం తీవ్ర ఆగ్రహం ఉందని.. సార్వత్రిక ఎన్నికల నాటిని ఇది మరింత తీవ్ర రూపం దాల్చటమే కాదు.. కేసీఆర్ కు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలటం ఖాయమన్న మాటను ఆయన నమ్మకంగా చెబుతున్నారు.

అంతేకాదు.. 2019ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తానే సారథ్యంవహిస్తానని చెబుతున్న ఉత్తమ్.. మరో ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని చెప్పారు. ఉత్తమ్ మాటలు విన్నప్పుడు.. విపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు కూడా ఇదేతరహా ప్రకటనలు చేసేవారు. బీసీలకు వంద సీట్లు అని ఒకసారి.. మైనార్టీలకు.. వివిధ వర్గాల వారికి తానిచ్చే సీట్ల లెక్కను ఎన్నికలకు ఏళ్ల ముందే ఆయన చెబుతుండేవారు. చివరకు.. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చి.. నామినేషన్ల సమయం మించిపోతున్న వేళ.. హడావుడిగా టిక్కెట్లు ఇవ్వటం చూస్తున్నదే. ఇప్పుడు ఉత్తమ్ పరిస్థితి కూడా ఇంచుమించే ఇదేరీతిలో ఉంటుందని చెప్పాలి. అయినా.. ఎన్నికల్లో అభ్యర్థుల్ని డిసైడ్ చేసేది తాను కాదని.. ఢిల్లీలో కూర్చున్న పెద్దలన్న విషయాన్ని ఉత్తమ్ మర్చిపోయారా ఏంది?  అయినా.. బాబు తరహా మాటలు అవసరమా ఉత్తమ్..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News