ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అందిస్తున్న ఇన్వెస్టిగేషన్ స్టోరీ

Update: 2018-01-22 15:05 GMT

తెలంగాణ పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన విషయం ఒకటి వెల్లడించారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుగు రాష్ర్టాల్లో చంద్రబాబుకు - కేసీఆర్‌ కు తప్ప ఇంకెవరికీ తెలియదని.. చివరకు బీజేపీ నాయకులకు కూడా తెలియదని, అలాంటిది తనకు తెలుసని ఉత్తమ్ అంటున్నారు. ఇంతకీ ఆయన చెబుతున్నదేంటో తెలుసా.. తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయం. అవును.. చంద్రబాబు, కేసీఆర్‌లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సీట్ల పెంపు వ్యవహారానికి మోదీ ఓకే చెప్పారని.. కానీ, కేసీఆర్ - చంద్రబాబులు ఆ విషయం రహస్యంగా ఉంచారని ఆయన అంటున్నారు
    
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గా పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన నోట్‌పై మోదీ సంతకం చేశారని.. దిల్లీ నుంచి తనకు నమ్మకమైన సమాచారం ఉందని ఉత్తమ్ చెబుతున్నారు.
    
కాగా ఉత్తమ్ మాటల్లో వాస్తవం ఉండొచ్చని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. తాజాగా చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో నియోజకవర్గాల్లో ఏ పార్టీ నుంచి నాయకులు వచ్చినా తీసుకోమని.. అందరికీ సర్దుబాటు చేద్దామని అన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఈ ధైర్యంతోనే ఆ మాట చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ కూడా పార్టీ విస్తరణపై మరోసారి దృష్టి పెడుతున్నారు.
    
నిజానికి తొలుత మోదీ - అమిత్‌ షాలు తెలుగు రాష్ర్టాల్లో సీట్ల పెంపకంతో తమకేంటి లాభమన్నట్లుగా వ్యవహరించారు. కానీ.. చివరకు అమిత్ షా దీనికి ఆమోదం చెప్పడంతో మోదీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలో జార్ఖండ్‌ లో కూడా ఎన్నికలు ఉండడం.. అక్కడ కూడా సీట్లు పెంచాలని బీజేపీ అనుకుంటుండడంతో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News