టికెట్ల కేటాయింపులో చక్రం తిప్పటమే కాదు.. తనకు నచ్చనోళ్లను.. తనతో కలిసి నడిచే ఛాన్స్ ఉండదన్న సందేహం ఉన్నోళ్లను చాలా తెలివిగా ఎన్నికల బరిలో నుంచి ఉత్తమ్ తప్పించినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం తెలిసిందే. టికెట్ల కేటాయింపులో ఉత్తమ్ కీ రోల్ ప్లే చేసినట్లుగా చెబుతున్నారు.
పైకి ఎన్ని నీతులు చెప్పినా.. బ్యాక్ గ్రౌండ్ లో తాను పైలెట్ అని ఎన్ని కోతలు కోసినా.. లోగుట్టు విషయాల్ని చూస్తే.. ఉత్తమ్ అంత ఉత్తముడు కాదన్న మాట పలువురు కాంగ్రెస్ నేతల నోటి నుంచి వస్తోంది. తాజాగా ఒక ఆసక్తికర అంశం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద మనిషి అన్నంతనే గుర్తుకొచ్చే పేరు జానారెడ్డి. కీలకమైన ఎన్నికల వేళ.. జానా సాబ్ అస్సలు కనిపించటం లేదెందుకు? అని చూస్తే.. ఆయన తాను బరిలో ఉన్న నియోజకవర్గం దాటి పెద్దగా రాని పరిస్థితి. ఎందుకిలా ఉంటే.. ఎప్పుడూ లేని రీతిలో ఆయన నిర్వహిస్తున్న రోడ్ షోలలో.. ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇన్నిసార్లు ఎమ్మెల్యేను చేస్తే.. నియోజకవర్గానికి మీరేం చేశారంటూ ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆయన కిందా మీదా పడిపోతున్నట్లు చెబుతున్నారు. జానా ఒక్కరే కొదు.. మరికొందరు ప్రముఖ కాంగ్రెస్ నేతలకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. ఎందుకిలా? అన్న ప్రశ్నకు వస్తున్న సమాధానం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఉత్తమ్ కు చెందిన గ్రూపు నేతలు.. తమ నేతకు ధీటుగా ఎవరైనా ఎదిగే ఛాన్స్ ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.ఈ కారణంతోనే జానాతో సహా.. పలువురు కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న రోడ్ షోలలో నిలదీతలు ఎదురవుతున్నట్లుగా సమాచారం. ఓటర్లు నిలదీస్తే అందరిని నిలదీయాలి కానీ.. కొందరి విషయంలో మాత్రమే ఇలాంటివి ఎందుకు ఎదురవుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.