అనూహ్యంగా తెర మీదకు వచ్చిన తెలంగాణ పురపాలక ఎన్నికల షెడ్యూల్ విడుదల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు టీ పీసీసీ చీఫ్ కమ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎన్నికల నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారు? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఎన్నికలకు కీలకమైన రిజర్వేషన్లపై ఎన్నికల సంఘం తీరును ఉత్తమ్ తప్పు పడుతున్నారు. డిసెంబరు 23న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి.. జనవరి ఆరున రిజర్వేషన్లు ప్రకటించటం ఏమిటి? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు డిసైడ్ చేయకుండా పార్టీ అభ్యర్థులను ఎలా ఖరారు చేస్తారు? ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. రిజర్వేషన్లు తెలీకుండా అభ్యర్థుల ఖరారు ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.
తాజాగా విడుదలైన ఎన్నికల షెడ్యూల్ అధికారపార్టీకి మేలు చేసేలా ఉందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జనవరి ఆరున ఓటర్ల జాబితా.. రిజర్వేషన్లు ఖరారుచేస్తామంటున్నారని.. 8 నుంచి 10 లోపు నామినేషన్లకు అవకాశం ఇవ్వటాన్ని ఉత్తమ్ తప్ప పట్టారు.
మూడు రోజుల వ్యవధిలో ఇతర పార్టీలు తమ అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేసుకుంటారు? అని ప్రశ్నించారు. అభ్యర్థుల్ని ఎంపిక చేసుకునేందుకు సైతం పార్టీలకు అవకాశం లేకుండా.. కేవలం అధికారపార్టీకి అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని విమర్శించారు. అభ్యర్థుల ఎంపికకు ఒక్క రోజు మాత్రమే గడువు ఇవ్వటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు. మరి.. కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
పట్టణ ప్రాంతాల్లో టీఆర్ ఎస్.. బీజేపీలకు వ్యతిరేకంగా పరిస్థితి ఉందని.. పవర్లో ఉన్న వారు కేవలం డబ్బుతో ఓటింగ్ ను ప్రభావితం చేస్తున్నారన్నారు. ఈ పుర ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉత్తమ్. మరి.. ఆయన వాదనకు హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.