తెలివైన రాజకీయ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తారు కానీ తామిచ్చిన ఆ స్టేట్మెంట్లు నిజం కాకపోతే ఏం చేస్తామనే కమిట్‌మెంట్ మాత్రం ఇవ్వరు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలివైన నాయకుడే అయినా ఎందుకో ఆయన భారీ స్టేట్మెంట్ ఇచ్చి.. అది నిజం కాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కమిట్ అయ్యారు. నాయకులు తమ కమిట్మెంట్లకు కట్టుబడి ఉండరన్నది అందరికీ తెలిసిందే అయినా ఈ సోషల్ మీడియా యుగంలో ట్రోలింగ్‌కు ఈ కమిట్మెంట్లు ఉపయోగపడతాయన్నదే పాయింట్.
ఇక అసలు విషయానికొస్తే.. తెలంగాణ కాంగ్రెస్ మాజీ సారథి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి 50 వేల మెజారిటీతో గెలుస్తానని... 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.
నువ్వానేనా అన్నట్లుగా ఎన్నికలు జరుగుతున్న కాలంలో ఒక అసెంబ్లీ స్థానం నుంచి 50 వేల మెజారిటీ అంటే ఈ రోజుల్లో చిన్నవిషయం కాదు. 10 వేల మెజారిటీయే పెద్ద మెజారిటీ అయిపోయిన కాలం ఇది. అలాంటి 50 వేల మెజారిటీ అంటే మాటలు కాదు.
హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపే కావొచ్చు కానీ అదే హుజూర్‌నగర్‌లో 2019 ఉప ఎన్నికలో ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి 43 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయిన విషయం మర్చిపోకూడదు. అలాగే 2009 నుంచి వరుసగా మూడుసార్లు హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో ఎన్నడూ 50 వేల మెజారిటీ సాధించిన సందర్భం లేదు.
2018 ఎన్నికలలో ఆయన 7 వేల ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో సుమారు 24 వేల ఓట్ల మెజారిటీ... 2009లో సుమారు 29 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఉత్తమ్ మంచి మెజారిటీయయే సాధిస్తున్నా సుమారు 2,20,000 ఓట్లున్న నియోజకవర్గంలో 50 వేల మెజారిటీ సాధించడమంటే అది కష్టమైన పనే.
అందుకేనేమో... ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన విన్నవారంతా ఉత్తమ్ కుమార్ కాస్త ఉత్తర కుమారుడిగా మారినట్లుందే అంటూ వెటకారమాడుతున్నారు. భారతంలో ఉత్తర కుమారుడి ప్రగల్భాల మాదిరిగా హడావుడి చేస్తున్న ఈ కాంగ్రెస్ నేత ఎన్నికలు వచ్చేనాటికి ఏం చేస్తారో చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.