తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నరేళ్ల పరిపాలనపై టీఆర్ ఎస్ శ్రేణులు సంబారులు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ తనదైన శైలిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇటీవలిల కాలంలో కేసీఆర్ తీరుపై విరుచుకుపడుతున్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు వైఫల్యాలకు నిరసనగా ఈ నెల 20న 20న ఇందిరా పార్కు వద్ద ఒకరోజు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
రెండున్నరేళ్ల సంబరాలపై కేసీఆర్ సమీక్ష చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో కనీసం 5 శాతం కూడా అమలుకు నోచుకోలేదని, పైగా ఈ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రికి అవినీతి ఎమ్మెల్యేలను కొనడానికే సరిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ ఊసే లేదని - బీసీల గురించి పట్టించుకోలేదని ఉత్తమ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వానిది నక్సల్స్ ఎజెండా అని చెబుతూ బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నయీం కేసులో ఒక్క రాజకీయనాయకుడు, పోలీసు అధికారైనా ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడాన్ని చూస్తుంటేనే ఈ కేసును కేసీఆర్ స్వయంగా నిర్వీర్యం చేస్తున్నారని తేలిపోతోందని ఉత్తమ్ ఆరోపించారు. నిజానిజాలు తేలేందుకు నయీం ఎన్ కౌంటర్ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని, ఇద్దరు చంద్రులు కలిసి ఈ కేసును బొందపెట్టే కుట్ర చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఉత్తమ్ జోస్యం చెప్పారు.
ఇదిలాఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్ కు పాలనా అనుభవం లేదని రెండున్నరేళ్ల పాలనతో రుజువైందని విమర్శించారు. అబద్ధాలు ధైర్యంగా, అందంగా చెప్పడంలో కేసీఆర్ పాస్ అయ్యారని ఎద్దేవా చేశారు. హామీలు గాలికొదిలేసి.. పిట్టల దొరల మాటలతో పాలన గడిపేస్తున్నారని దీంతో బంగారు తెలంగాణ కాస్తా చీకట్ల తెలంగాణాగా మారిపోయిందని షబ్బీర్ అలీ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/