భూముల ర‌చ్చ‌లో కొత్త కోణాన్ని బ‌య‌ట‌కు తీశారు

Update: 2017-06-15 04:15 GMT
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అక్ర‌మ భూ రిజిస్ట్రేష్ల ఉదంతంలో తెలంగాణ అధికార‌ప‌క్షానికి చెందిన ప‌లువురు నేత‌ల‌కు సంబంధాలు ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇవి నిజ‌మ‌న్న‌ట్లుగా తాజాగా కొంద‌రు టీఆర్ఎస్ నేత‌లు ఓపెన్ కావ‌టం విశేషం. ఇదిలా ఉంటే.. భూ కుంభ‌కోణం అన్న‌ది లేద‌ని.. ఈ ఎపిసోడ్‌లో  ప్ర‌భుత్వం ఒక్క రూపాయి కూడా న‌ష్ట‌పోలేదంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. భూ కుంభ‌కోణాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించి.. అక్ర‌మాలు ఏమీ చోటు చేసుకోలేద‌న్న వాద‌న‌ను త‌ప్పు ప‌డుతూ.. తెలంగాణ విపక్షాలు మండిప‌డుతున్నాయి. తాజాగా ఈ ఉదంతంపై గ‌ళం విప్పారు తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర‌వుతున్న మియాపూర్ భూముల్ని ఆయ‌న సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నో ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పుకొచ్చారు. వివిధ పార్టీల‌లో నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన నేత‌ల‌కు పార్టీ న‌జ‌రానాలు అంద‌జేసింద‌ని ఆరోపించారు.  ఇంత పెద్ద కుంభ‌కోణం జ‌రిగితే.. ముఖ్య‌మంత్రి మాత్రం ఏమీ జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నారన్నారు.

న‌గ‌రంలో వేలాది కోట్ల రూపాయిల భూముల కుంభ‌కోణం జ‌రిగినా.. దీనిపై ముఖ్య‌మంత్రి కుమారుడు.. మంత్రి కేటీఆర్ పెద‌వి విప్ప‌క‌పోవ‌టాన్ని ఉత్త‌మ్ త‌ప్పు ప‌ట్టారు. భూముల‌పై సీబీసీఐడీ విచార‌ణ‌కు ఆదేశించిన ముఖ్య‌మంత్రే.. అస‌లేం కుంభ‌కోణం జ‌ర‌గ‌లేద‌ని క్లీన్ చిట్ ఇవ్వ‌టం ఏమిటన్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో న‌డిచే సీఐడీ ఇప్ప‌టివ‌ర‌కూ ఏ కేసును ఒక కొలిక్కి తీసుకురాలేద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ లోకి చేరిన ప‌లువురు నేత‌ల‌కు సంబంధించిన భూ చిట్టాల్ని ఆయ‌న బ‌య‌ట‌కు తీయ‌టం విశేషం.

1. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన కేకే త‌న కుమార్తె.. కోడ‌లి పేర్ల‌తో హ‌ఫీజ్ పూర్ లో గోల్డ్ స్టోన్ కంపెనీ నుంచి భూములు కొనుగోలు చేయ‌టం

2. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన కూక‌ట్ ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావుకు గోల్డ్ స్టోన్ కంపెనీ నుంచి 10 ఎక‌రాలు కూకట్ ప‌ల్లి ప్రాంతంలోనూ.. వారి అనుచ‌రుల పేరు మీద హ‌స్మ‌త్ పేట‌లో కొంత భూమికి ఒప్పందాలు జ‌రిగాయి

3. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన రెడ్యానాయ‌క్ కుమార్తె ఎం. క‌విత‌కు హ‌ఫీజ్ పేట ప్రాంతంలో 4 ఎక‌రాలు అగ్రిమెంట్ చేయ‌టం

4. ఖ‌మ్మం జిల్లా ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ కు రూల్స్‌కు భిన్నంగా భూముల్ని క‌ట్ట‌బెట్ట‌టం
Tags:    

Similar News