దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ అది. దేశాన్ని, తెలుగు నేలను ఎన్నో ఏళ్లు పాలించిన పార్టీ అది.. అలాంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో దారుణంగా ఉంది.. తెలంగాణలో మరింత దారుణంగా ఉందని తాజా పరిస్థితులు చెబుతున్నాయి. కనీసం గాంధీభవన్ లో ఫ్యాన్లు - లైట్లు వేసినా కరెంటు బిల్లు కట్టలేనంతగా దివాలా తీశారట. గాంధీ భవన్ కు వెళ్లి గంట సమయం ఉంటే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది.
చేతిలో రూపాయి లేదని... పార్టీకి పైసా కూడా విరాళాలు రావడం లేదని... అయినా, గాంధీ భవన్ కు అత్తారింటికి వచ్చినట్లుగా వచ్చి ఏసీలు, ఫ్యాన్లు వేసుకుని రెస్టు తీసుకుంటున్నారని... ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారని... ఒక్కరు రూపాయి సాయం చేయడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడుతున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆయన గాంధీ భవన్ కు ఏ స్థాయి నేత వచ్చినా కూడా ఏసీ వేసుకోరాదని ఆర్డర్ పాస్ చేశారట. అంతేకాదు... లైట్లు, ఫ్యాన్లు కూడా అవసరాన్ని బట్టే వేయాలని... అవసరం తీరిన వెంటనే ఆపేయాలని రూల్ పాస్ చేశారు. గాంధీభవన్ ల్యాండ్ లైన్ నుండి అవసరం లేని కాల్స్ వెళ్తున్నాయని... వాటిని కంట్రోల్ చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. తాను, మల్లు భట్టివిక్రమార్క, ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు వచ్చినప్పుడే ఏసీ వేయాలని... తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంకెవరు వచ్చినా ఏసీ వేయొద్దని గట్టిగా ఆర్డరు పాస్ చేశారట. చివరకు జానారెడ్డి లాంటి సీనియర్ నేతయినా కూడా ఏసీ వేయొద్దని... అడిగితే తన పేరు చెప్పండని ఉత్తమ్ సిబ్బందికి గట్టిగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఉత్తమ్ తీరుతో సీనియర్ నేతలు మండిపడుతున్నారట.. గాంధీభవన్ లో ఈమాత్రం సౌకర్యాలపైనా ఆంక్షలు విధించడం సిగ్గుచేటంటున్నారు. రావొద్దంటే మానేస్తాం కానీ ఆంక్షలు పెడితే సహించబోమని ఆగ్రహిస్తున్నారు. చేతకాకపోతే ఇంటి దగ్గర కూర్చోవాలి. పెద్ద పదవి కావాలి కానీ…కరెంట్ బిల్లులు కూడా కట్టలేరా అని ఉత్తమ్ పై పరోక్షంగా మండిపడుతున్నారు.
అయితే...సీనియర్లను, ఇతర నేతలను అవమానించడం ఉత్తమ్ ఉద్దేశం కాదని.. పార్టీని బతికించుకోవడానికి విరాళాలు అవసరమైనా నేతలెవరూ జేబులోంచి రూపాయి కూడా తీయడం లేదని.. ఎన్నికల్లో టిక్కెట్లు కావాలంటే మాత్రం వచ్చేస్తారని... అందుకే వారికి బుద్ధి చెప్పాలనే ఇలా చేస్తున్నారని ఉత్తమ్ వర్గం అంటోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లే ఉంది.