ఉత్తమ్ భార్యకు షాక్.. వదిలేయాల్సిందేనా?

Update: 2018-10-25 08:43 GMT
గడిచిన ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేసిన గెలిచిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి తాజా ఎన్నికల్లో పోటీచేయరాదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మహాకూటమి పొత్తుల్లో భాగంగా కోదాడ సీటును కోరుతున్న టీడీపీకి తన సీటును ఇవ్వడానికి పద్మావతి డిసైడ్ అయినట్టు సమాచారం.

1980 నుంచి టీడీపీకి బలమైన సీటుగా కోదాడ ఉంది. తెలంగాణ టీడీపీలో బలమైన నాయకుడైన బొల్లం మల్లేష్ యాదవ్ గత ఎన్నికల్లో కేవలం 13, 374 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాగా కాంగ్రెస్ అధిష్టానం ఒక కుటుంబానికి ఒక సీటే అన్న ఫార్ములాను ఉత్తమ్ ఫ్యామిలీ కూడా పాటించాలని ఆదేశించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే హూజూర్ నగర్ నుంచి ఉత్తమ్ పోటీచేసి కోదాడను టీడీపీకి వదిలేయాని డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి.

అయితే ఉత్తమ్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతికి సీటు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారట.. అది కాంగ్రెస్ గెలిచిన తాజా సీటు అని.. మరోసారి గెలుస్తామని అధిష్టానాన్ని ఒప్పించే పనిలో పడ్డారట.. అయితే అధిష్టానం మాత్రం ఉత్తమ్ ఫ్యామిలీకి రెండు సీట్లు ఇస్తే.. జానారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కొండా సురేఖ తదితరులు కూడా తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరే ప్రమాదం ఉందని.. అందుకే ఉత్తమ్ కు కూడా ఒకటే సీటు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ భార్య పద్మావతికి ఈసారి కోదాడ టికెట్ దక్కడం కష్టమేనన్న ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News