ఏందో బొత్తిగా ఈ కాలం అర్థం కావడంలా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇలా కూడా వాడేస్తున్నారు. ఆన్ లైన్ లో వస్తువులనే ఇప్పటి వరకు దొరికేవి. డేటింగ్ లు - మీటింగులు జరిగేవి. కొంతమంది ఒక అడుగు ముందుకేసి పెళ్లిళ్లు కూడా జరిపించేస్తున్నారు. మరి శోభనం సంగతో? అంటే.. అది మాత్రం ఆఫ్ లైన్ లోనే అనేస్తున్నారు. ఆన్ లైన్ లో ఒకటైన ఈ జంట గురించే అంతా చర్చించుకుంటున్నారు.
యూపీలోని గోండాకు చెందిన రాధాకుండ్ ప్రాంతంలో ఉండే మహ్మద్ అలీమ్ తనకూతురు అక్బరీకి వివాహం చేయాలని నిశ్చయించాడు. కర్నౌల్ జంగ్ ప్రాంతానికి చెందిన లియాతక్ అలీ కొడుకు రమ్జాన్ అలీతో నిశ్చితార్ధం జరిపించారు. ఆ తరువాత పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారు.
రమ్జాన్ అలీకి దుబాయ్ లో ఉద్యోగం. పెళ్లి రోజుకు ఎలాగైనా ఇండియాకు చేరుకుంటానని అన్నాడు. కానీ, వీసా సమస్య తలెత్తింది.
అనుకున్న సమయానికి పెళ్లికి చేరుకోలేకపోయాడు. మరోవైపు పెళ్లి ఫలానా రోజు అని కార్డులు కూడా పంచేశారు. బంధుమిత్రలు హాజరయ్యారు. దాంతో ఇరు కుటుంబాల పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. పెళ్లి వాయిదా పడకూడదని భావించి.. టెక్నాలజీ సాయం తీసుకున్నారు. వెంటనే రమ్జాన్ అలీకి ఫోన్ చేసి వీడియో కాల్లోకి తీసుకున్నారు. బంధువులందరి సమక్షంలో పెళ్లి కూతురిని కూర్చొబెట్టారు. పెళ్ళికొడుకును ఆన్ లైన్ చిత్రాన్ని ఆమె ఎదురుగా ఉంచారు. ఇద్దరూ ఆన్ లైన్ లో ఉండగానే ముస్లిం మత పెద్ద నిఖా చదివారు. పెళ్లి కి ఇద్దరు అంగీకారం తెలపడంతో నిఖా తతంగం ముగిసింది.
ఆన్ లైన్ సాయంతో ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే.