ఈ మంత్రి బీకాం ఫిజిక్స్ అన్న‌య్య‌

Update: 2017-09-15 16:08 GMT
బీకాం ఫిజిక్స్‌....తెలుగు రాష్ర్టాల్లో బీకాంలో ఫిజిక్స్ గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎందుకంటే..అంత‌ ఫేమ‌స్ అయింది స‌రిగ్గా అలాంటి పాపుల‌ర్ కామెడీనే ఇప్పుడు ఉత్త‌రాఖండ్‌ లో పాపుల‌ర్ అవుతోంది.  (-1) + (-1) = 0 ఇప్పుడు ఈ లెక్క ఉత్త‌రాఖండ్‌ లో ఫేమ‌స్. ఎంద‌కింత ఫేమ‌స్ అంటే దాన్ని చెప్పింది ఓ మంత్రిగారు. అందులోనూ సాక్షాత్తూ ఉత్త‌రాఖండ్ విద్యాశాఖ మంత్రి అర‌వింద్ పాండే.

డెహ్రాడూన్ లో ఓ స్కూల్లో అర‌వింద్ పాండే ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. టీచ‌ర్ ను తిక‌మ‌క పెట్టాల‌ని లెక్క‌ల్లో ప్ర‌శ్న‌లు వేశారు. ఇందులో భాగంగా (-1) + (-1) ఎంత అంటూ ప్ర‌శ్నించ‌గా టీచ‌ర్ -2 అంటూ స‌మాధానం చెప్పారు. ఇలాగేనా పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పేంది అంటూ టీచ‌ర్ ను తిడుతూ .. ఆన్స‌ర్ 0 అని చెప్పారు. దీనికి సంబంధించిన‌ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు టీచ‌ర్ ను తిట్ట‌డంపై ఉత్త‌రాఖండ్ లో టీచ‌ర్లు ఆందోళ‌న చేప‌ట్టారు. మంత్రి త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News