అన్ని రాష్ట్రాల్లో క్వారంటైన్ కేంద్రాలుగా ఈ సమయంలో ఖాళీగా ఉన్న స్కూళ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలను వాడుతున్నారు.కానీ ఉత్తర ఖండ్ ప్రభుత్వం మాత్రం వినూత్నంగా ఆలోచించింది.ఎవరూ వెళ్లని ‘దెయ్యాల గ్రామాలను’ క్వారంటైన్ కేంద్రాలుగా మార్చింది. లాక్ డౌన్ తో ఆయా రాష్ట్రాల్లో చిక్కుకొనిపోయి ఉత్తరాఖండ్ కు వచ్చిన వలస కార్మికులకు కరోనా ఉందో లేదో సోకుతుందేమోనన్న భయంతో ఖాళీగా ఉండి పాడుపడిపోయిన ‘దెయ్యాల గ్రామాల్లో’ వసతులు కల్పించి క్వారంటైన్ చేస్తోంది.
ఉత్తరఖండ్ లోని పౌరి జిల్లాలో చాలా గ్రామాలను కనీస సదుపాయాలు లేక జనాలు విడిచిపెట్టి పట్టణాలకు వలస వెళ్లారు. తాగడానికి నీరు, తినేందుకు తిండి, మౌళిక వసతులు లేని కొండ ప్రాంతాల్లో నివాసం ఉండలేక వదిలేశారు. దీంతో అక్కడ ఇళ్లన్నీ ఖాళీగా ఉంటాయి. వీటినే ‘దెయ్యాల గ్రామాలుగా’ స్థానికులు పిలుస్తుంటారు.
ఇప్పుడు వలస కార్మికులను క్వారంటైన్ చేసేందుకు ఈ ఇళ్లను వినియోగించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. పౌరి జిల్లాలో ఇలా జనాలు వదిలేసిన 186 నిర్మానుష్య గ్రామాల్లో ఇళ్లను శుభ్రం చేసి మౌళిక వసతులను అధికారులు కల్పిస్తున్నారు. అన్ని సదుపాయాలు కల్పించి 576 మందిని క్వారంటైన్ చేశారు. కొండ ప్రాంతంలో సస్యశ్యామలమైన ఆహ్లాదకర ప్రాంతాల్లో జనాలకు దూరంగా వీరిని ఉంచారు.
కొన్ని దశాబ్ధాలుగా ఖాళీగా ఉన్న ఈ దెయ్యాల గ్రామాలకు ఎవరూ రారు. వాటిని వలస కూలీలకు క్వారంటైన్ గా ఉత్తరఖండ్ సర్కార్ మార్చింది. అయితే వలస కూలీలు భయపడకుండా పోలీసులు, వైద్య అధికారులు కూడా వారితో పాటే అక్కడే ఉంటూ వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.