భారత రాజకీయాల్లో కనిపేంచే ఏ దరిద్రానికైనా కాంగ్రెస్ మూల కారణంగా చెబుతారు. కరడుగట్టిన కాంగ్రెస్ వాదులకు ఇలాంటి మాటలు చాలా కఠినంగా అనిపించటతోపాటు.. తీవ్రంగా మనసు నొచ్చుకుంటారు. కానీ.. సాపేక్షంగా చూసినప్పుడు దేశంలో చోటుచేసుకున్న పలు పరిణామాలకు.. రాజకీయ వైఖరికి.. కీలక సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలకు దేశం ఎలా బలైపోయిందో చరిత్ర కంటి ముందు కనిపిస్తుంటుంది. పలు సందర్భాల్లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల్ని ఫాలో అయిన రాజకీయ పక్షాలు చాలానే ఉన్నాయి. కాకపోతే సమస్య ఏమిటంటే.. తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మరో మాట లేకుండా సమర్థించుకునే కాంగ్రెస్.. తాము విపక్షంలో ఉన్నప్పుడు అవే నిర్ణయాలను మొహమాటం లేకుండా తప్పుపడుతుంటుంది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయటం కనిపిస్తుంది.
తాజాగా ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే. ఉత్తరాఖండ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారుకు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీ ఎమ్మెల్యేలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేయటం.. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సాగుతోంది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యం హత్యకు గురి అవుతోందని ఆరోపిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి.. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద నీతిని ఎండగట్టటమే కాదు.. చరిత్రను తవ్వి తీసిన ఆయన.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రధాన మంత్రులు ఎన్నెన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారన్నది లెక్కలు చెప్పుకొచ్చారు. అంతకు ముందు.. ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్న పరిణామాల్ని సమర్థించిన వెంకయ్య.. ఉత్తరాఖండ్ సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే కారణంగా చెప్పుకొచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఎమ్మెల్యేలతో బేరాలాడుతూ కెమేరాలకు అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.
తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బేరసారాలు ఆడుతూ కెమేరా కంటికి దొరికిపోవటం.. ఆ సీడీల్ని కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బయట పెట్టటం ఇప్పుడక్కడ సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రాష్ట్రపతి పాలన విధించిందని.. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాని కాంగ్రెస్ నేతలకు.. ఇప్పుడు పెడబొబ్బలు పెట్టటం ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సర్కారు కేంద్రంలో కొలువు తీరిన సమయంలో.. ఆ పార్టీ నేతలు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు.. వారి హయంలో ఎన్నెన్ని సార్లు రాష్ట్రపతి పాలన పెట్టారన్న విషయాన్ని ప్రధానమంత్రుల వారీగా లెక్క చెప్పుకొచ్చారు. దేశ తొలి ప్రధాని.. కాంగ్రెస్ నేత జవహర్ లాల్ నెహ్రు తన హయాంలో 7 సార్లు రాష్ట్రపతి పాలన విధిస్తే.. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ ఏకంగా 50 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని.. ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 6 సార్లు రాష్ట్రపతి పాలన విధింపు నిర్ణయాన్ని తీసుకున్నారని పేర్కొన్నారు.
రాజీవ్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానిగా పని చేసిన పీవీ నరసింహరావు తన హయాంలో 11 సార్లు రాష్ట్రపతి పాలన విధిస్తే.. మన్మోహన్ సింగ్ హయాంలో 10 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రధానుల లెక్కతో ఆపకుండా బీజేపీ ప్రధానుల లెక్కను వెంకయ్య చెప్పటం గమనార్హం. నాటి వాజ్ పేయ్.. నేటి ప్రధాని మోడీ హయాంలో ఇప్పటివరకూ 6 సార్లు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. వెంకయ్య తీసిన తాతల లెక్క కాంగ్రెస్ నేతల నోటికి తాళం వేస్తుందనటంలో సందేహం లేదు.