కొన్ని కాంబినేషన్లు భలేగా ఉంటాయి. ఆ కాంబినేషన్లను గుర్తుకు తెచ్చుకున్నంతనే కొన్ని ఫీలింగ్స్ మనసుకు వచ్చేస్తుంటాయి. కాంబినేషన్లే కాదు.. వ్యక్తులు కూడా. ఉదాహరణకు గవర్నర్ నరసింహన్ ను గుర్తుకు తెచ్చుకున్నంతనే వీహెచ్ నోట విమర్శల వర్షం తప్పించి మరింకేమీ ఉండదు. ఇక.. కేసీఆర్ ప్రస్తావన తేకుండా ఉండటమే మంచిది.
మరి.. అలాంటి గవర్నర్ గురించి వీహెచ్ పొగడటం ఊహించలగమా? కానీ.. ఇది నిజం. తాజాగా గవర్నర్ నరసింహన్ ను భలేగా పొగిడేశారు హనుమంతన్న. నరసింహన్ తన జీవితంలో మంచి పని చేశారన్నారు. ఇంతకీ వీహెచ్ మనసును అంతలా దోచేసేలా గవర్నర్ ఏం చేశారంటారా? ఇటీవల కొత్త మున్సిపల్ చట్టాన్ని హడావుడిగా తీసుకొచ్చేసి.. పరుగులు పెట్టించి మరీ అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ సాబ్ కు పంపిన బిల్లును గవర్నర్ అంతే వేగంగా తిరస్కరించటం తెలిసిందే.
బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని.. వాటిలో మార్పులు చేసి పంపాలని.. ఆ మార్పులు పూర్తి చేసిన పంపిన తర్వాత దాన్ని ఆమోదించేందుకు కేంద్రానికి పంపాలని గవర్నర్ నిర్ణయించటం తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా రియాక్ట్ అయిన వీహెచ్.. గవర్నర్ నరసింహన్ జీవితంలో మంచి పని చేశారని.. ఉన్నన్ని రోజులు భజన చేశారని.. కానీ పదవి వదిలి వెళ్లేటప్పుడు మాత్రం మంచి పని చేశారన్నారు.
గవర్నర్ ను అంతలా పొగిడేస్తున్న వీహెచ్.. గవర్నర్ అలా రియాక్ట్ కావటానికి కారణం మోడీ సాబ్ అంటున్న వారి మాటల్ని విని.. ఆయన్ను కూడా పొగిడేస్తారా? అయినా.. నరసింహన్ సారు గారికి తెలీదా? ఎప్పుడేం చేస్తే.. ఎలాంటి రిజల్ట్ వస్తుందో. ఆ మాత్రం తెలీకుండానే అన్నేసి రోజులు తెలుగు నేల మీద గవర్నర్ గిరిని వెలగబెడతారా చెప్పండి?