అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లు అభ్యంతరకరంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వాటిని చింపేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ల వివాదంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - వీహెచ్ ల మధ్య మాటల యుద్ధం - సవాళ్ళు-ప్రతి సవాళ్లు నడిచాయి. ఆ వివాదం సద్దుమణిగిందనే లోపు మరోసారి అర్జున్ రెడ్డి సినిమాపై వీహెచ్ విమర్శలు చేశారు. ఆ సినిమా బాగుందంటూ ట్వీట్ చేసిన ఐటీ మంత్రి కేటీఆర్ పై వీహెచ్ ఫైర్ అయ్యారు. అటువంటి సినిమాను ప్రోత్సహించడం ద్వారా కేటీఆర్ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని మండి పడ్డారు. ఆ సినిమా ప్రభావం వైద్యులపై పడే అవకాశముందని, ఆ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు.
అర్జున్ రెడ్డి సినిమా చాలా బాగుందని, ఈ సినిమాలో నటించిన హీరో విజయ్ దేవరకొండ రాక్ స్టార్ అని కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్లపై వీహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇటువంటి అసభ్యకరమైన సినిమాను బాగుందని మెచ్చుకున్న కేటీఆర్ ... ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని వీహెచ్ మండిపడ్డారు. కేటీఆర్ కు హీరో విజయ్ దేవరకొండ బంధువు కావడం వల్లే, ఈ సినిమాను కేటీఆర్ మెచ్చుకున్నారని వీహెచ్ ఆరోపించారు. ఈ సినిమాలో హీరో డ్రగ్స్ తీసుకునే సన్నివేశాలున్నాయని, ఈ సినిమా చూసి యువత పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో అభ్యంతరకర రీతిలో పెళ్లి కాకుండానే అమ్మాయిని తల్లిని చేసే సన్నివేశాలున్నాయన్నారు. డాక్టర్ పాత్రలో హీరో మందు తాగి పేషెంట్లకు వైద్యం చేసినట్లు హీరో గొప్పగా చెప్పుకునే సన్నివేశం ఉందని చెప్పారు. ఈ తరహా సినిమాల ప్రభావం యువతతో పాటు వైద్యులపై కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల అర్జున్ రెడ్డి సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.