బీజేపీకి చంద్రబాబు అపశకునమా?

Update: 2016-11-16 09:26 GMT
 ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హనుమంతరావు మండిపడ్డారు. ముఖ్యంగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన పెద్ద నో్ట్ల రద్దు వ్యవహారంలో చంద్రబాబు తీరు ఏమాత్రం బాగులేదని ఆయన ఫైరయ్యారు. దేశంలోని ముఖ్యమంత్రులంతా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే ఒక్క చంద్రబాబు మాత్రం ప్రధాని మోడీకి వంత పాడుతున్నారని... అప్పట్లో వాజ్ పేయిని కూడా చంద్రబాబు తప్పుడు సలహాలతో ముంచారని.. ఇప్పుడు మోడీని తన తప్పుడు ఆలోచనలు - సలహాలతో ముంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

పెద్ద నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసని వీహెచ్ అన్నారు.నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశంలోని అందరు ముఖ్యమంత్రులు మోడీ నిర్ణయాన్ని తప్పుపడుతుంటే చంద్రబాబు మాత్రమే ఎందుకు స్వాగతిస్తున్నారని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుకు తానే లేఖ రాశానని చంద్రబాబు చెప్పడాన్ని కూడా తప్పుపట్టారు. గతంలో వాజ్‌ పేయిని చెడగొట్టింది కూడా చంద్రబాబేనని... అలిపిరి ఘటన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్తే బాగుంటుందంటూ వాజ్‌ పేయిని చంద్రబాబే తప్పుదోవ పట్టించారని వీహెచ్ చెప్పారు. ఆ చంద్రబాబు దెబ్బకు అధికారం కోల్పోయారని..  ఇప్పుడు నోట్ల రద్దు సలహా ఇచ్చి నరేంద్ర మోడీని కూడా ముంచాలన్నది చంద్రబాబు ప్లానని అన్నారు.

2019 ఎన్నికల్లో మోదీకి - చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెబుతారని వీహెచ్ హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా నల్లధనులు - కార్పొరేట్ పెద్దలు హాయిగానే ఉన్నారని… కష్టమంతా సామాన్యులదేనని ఆయన అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News