ఘాటైన పదాలతో మాట్లాడటం ఒక కళ. కొంతమంది ఎంత మాట్లాడినా చప్ప చప్పగా ఉంటుంది. మరికొందరు నోరు తెరిచి నాలుగుమాటలు చెబితే చాలు.. వాతావరణం వేడెక్కిపోతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావొచ్చు.. ఆయన కుమారుడు లోకేశ్ మాట్లాడుతున్నప్పుడు చూస్తే.. వారి మాటల ప్రభావం అంతంతమాత్రంగానే అనిపిస్తుంది. బాబు నిర్వహించే భారీ బహిరంగ సభలకు వచ్చే ముందు ఎంతో ఉత్సాహంగా వచ్చినా.. బాబు ప్రసంగం విన్నాక.. పెద్దగా ఉత్తేజితులు కావటం కనిపించదు.అదే సమయంలో ఈ తీరుకుపూర్తి భిన్నమైన ధోరణి తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలో కనిపిస్తుంటుంది.
ఇలా మాటలతో మంటలుపుట్టించే ఆర్ట్ ఉండే నేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన వీహెచ్ హనుమంతరావు ఒకరు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యభిచారం రోజురోజుకి పెరుగుతుందంటూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు ఒకపార్టీ నుంచి మరోపార్టీకి వెళ్లిపోయే తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
ఒక పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే వారు.. తర్వాతి కాలంలో ప్రలోభాలకు లొంగిపోయి అధికార పార్టీలోకి వెళ్లిపోవటం ఏ మాత్రం సరికాదన్నారు. ఇలాంటి ప్రలోభాలకుగురి చేయటం తప్పన్నమాటను చెప్పారు.
స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీల్లో చేరే వారు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారంటూ ఫైర్ అయిన వీహెచ్.. తాజాగా జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తీవ్రఅసహనం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ఫిరాయింపుదారులపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలన్న ఆయన.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. పవర్ ప్రయోజనాల కోసం ఇష్టరాజ్యంగా వ్యవహరించే అధికారపార్టీలకు వీహెచ్ లాంటి వారి మాటలు వినే ఛాన్స్ లేకున్నా.. ప్రజలకు మాత్రం చేరాల్సిన సమాచారం చేరుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/