కేసీఆర్ రాత్రంతా ఏం ఆలోచిస్తుంటాడో తెలుసా

Update: 2018-02-08 16:08 GMT
పెద్ద‌ల స‌భ‌లో ఎంపీగా ప‌ద‌విలో ఉన్న‌ప్ప‌టి కంటే...ప‌ద‌వి దిగిన త‌ర్వాతే దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు - మాజీ ఎంపీ వి.హనుంతరావు ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యుల ప‌ట్ల విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న సంచ‌ల‌న ఆరోపణ‌లు చేశారు. హైదరాబాద్ సోమాజీ గూడా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయం బైసన్ పోలో గ్రౌండ్‌ కు తరలించడాన్ని నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం - కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు స‌హా వివిధ వామపక్ష - రాజకీయ - ప్రజాసంఘాల నాయకులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా వీహెచ్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

కేసీఆర్ రాత్రులు మేలుకొని ఆలోచన చేస్తున్నాడని...సెక్రటేరియట్ మార్చాలని చూస్తున్నాడ‌ని వీహెచ్ ఆరోపించారు. ఈ విష‌యంలో కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని ఆరోపించారు. తన కొడుకుని సీఎం చేయడాని చిన్నజీయర్ స్వామి చెప్పినట్టు వాస్తుకోసం మార్పులు చేస్తున్నాడని వీహెచ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ను లోఫర్ పార్టీ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై వీహెచ్ ఈ సంద‌ర్భంగా మండిప‌డ్డారు. `కాంగ్రెస్ లోఫ‌ర్ పార్టీ అయితే...మీ నాన్న కాంగ్రెస్‌ లోనే రాజ‌కీయ జీవితం ప్రారంభించారు. ఈ లెక్క‌న మీ కుటుంబం మొత్తం లోఫర్ అవుతుంది` అని ఆరోపించారు. స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ...అందుకు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయ‌న వివ‌రించారు. `కేటీఆర్ అచ్చం శిఖండిలా ఉంటాడని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్రం బడ్జెట్‌ లో అన్యాయం జ‌రిగింద‌ని పేర్కొంటూ...ఈ విష‌యంలో సీఎం కేసీఆర్ - మంత్రి కేటీఆర్ ఎందుకు ప్రశ్నించరని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో అన్యాయం పై ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణ‌ పోరాటం చేయాలని సూచించారు.

తెలంగాణ కోసం పోరాటం చేసింది కోదండరాం అయితే జాక్ పాట్ కొట్టి కేసీఆర్ అని వీహెచ్ దుయ్య‌బ‌ట్టారు. `నాడు కేసీఆర్ సోనియాగాంధీ వద్ద తెలంగాణ తప్ప పదవులు వద్దని నమ్మించాడు. తెలంగాణకు దలిత ముఖ్యమంత్రి అని నమ్మించి మోసం చేసాడు.తెలంగాణలో సాంఘిక సంక్షేమ‌మంత్రిగా ఎస్సీ లేదా బీసీలు ఉండాల‌ని అయితే రెడ్డి అయిన జగదీశ్‌ రెడ్డికి ఆ శాఖ‌కు అప్ప‌గించారు. దళితుడిని సీఎం చేయలేదు స‌రికదా కనీసం మినిష్టర్ చేయ లేదు  అని ఆరోపించారు.

తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ నేను ముఖ్యమంత్రి అని అందరూ ప్రచారం చేసుకోవడంతో మా కాంగ్రెస్ పార్టి నష్ట పోయామని వీహెచ్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణలో ఎక్కువ పార్టీలు ఏర్ప‌డితే మళ్లీ టీఆర్ఎస్‌కు లాభం జరిగే అవకాశం ఉందని ప‌రోక్షంగా జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం పార్టీ ఏర్పాటును త‌ప్పుప‌ట్టారు.
Tags:    

Similar News