కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావుకు అంత పలుకుబడి ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకూ ఎన్ని చెప్పినా.. ఇకపై మాత్రం ఇప్పుడు చెప్పిన రెండు ఉదంతాలు చెబితే సరి. గాంధీల కుటుంబానికి తానెంత విధేయుడినన్న విషయాన్ని చెప్పుకునేందుకు వీహెచ్ అస్సలు సంకోచించరు. ఆయన మాటలు విన్నప్పుడు కాస్త హడావుడిగా అనిపించినా.. ఆయన చేతల్ని చూసినప్పుడు మాత్రం నిజమేననిపించక మానదు.
సంగారెడ్డిలో తాజాగా నిర్వహించిన ప్రజాగర్జన సభ సందర్భంగా.. ఈ భారీ సభను సింగిల్ హ్యాండ్ తో టేకప్ చేసి సక్సెస్ చేసిన క్రెడిట్ జగ్గారెడ్డిదే అంటూ.. రాహుల్‌కు పరిచయం చేశారు వీహెచ్. సభ కోసం కోట్ల రూపాయిల్ని ఖర్చు చేశారని గొప్పగా చెప్పారు. దీనికి స్పందించిన వీహెచ్.. మరి మీరేం చేశారని అడగటం.. దానికి సమాధానంగా వీహెచ్.. నా దగ్గర ఏముందని ఇవ్వటానికంటూ బదులివ్వటం.. చేతికి ఉన్న బ్రాస్ లెట్ ను చూపించి.. ఇది ఇవ్వొచ్చు అని సెటైర్ వేయడం తెలిసిందే. ఇదే విషయం మీడియాలో వైరల్ అయ్యింది. ఏం అనుకున్నారో ఏమో కానీ.. తాజాగా వీహెచ్ రియాక్ట్ అయ్యారు. తన చేతికున్న బంగారు బ్రేస్ లెట్ ను జగ్గారెడ్డికి ఇచ్చేశారు వీహెచ్. రాహుల్ సరదాగా అన్నప్పటికీ వీహెచ్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం గమనార్హం.
ఆ మాటకు వస్తే.. గాంధీ ఫ్యామిలీలో ఎవరి నోటి నుంచి ఏది వచ్చేసినా దాన్ని చేసేందుకు రెఢీ అయిపోతుంటారు వీహెచ్. దీనికి ఉదాహరణగా గతంలో చోటు చేసుకున్న ఒక పరిణామాన్ని చెప్పుకొచ్చారు వీహెచ్. ఏపీలోని లంక గ్రామాల్లో పడవలో పర్యటిస్తున్న వేళలో.. రాజీవ్ గాంధీతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో రాజీవ్ సరదాగా.. నా కోసం ఏదైనా చేస్తానని తరచూ చెబుతుంటారు.. మరి నదిలో దూకుతారా? అన్న వెంటనే.. తాను నదిలో దూకేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మొత్తానికి తన బ్రేస్ లెట్ ను జగ్గారెడ్డికి ఇచ్చేయటం ద్వారా గాంధీ ఫ్యామిలీకి తాను రియల్ కట్టప్ప అన్న విషయాన్ని వీహెచ్ చెప్పకనే చెప్పేసినట్లు లేదు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/