పవన్ కళ్యాణ్ సాయం కోరిన కాంగ్రెస్

Update: 2019-10-04 12:38 GMT
తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక హుజూర్ నగర్. ఈ కాంగ్రెస్ సిట్టింగ్ సీటులో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని తాజాగా జనసేన పార్టీని కాంగ్రెస్ కోరింది.

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తాజాగా హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఆ పార్టీ తెలంగాణ ఇన్ చార్జి శంకర్ గౌడ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, పలువురు జనసేన నేతలతో చర్చించారు. ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఓ లేఖను కూడా జనసేన పార్టీ నేతలకు అందజేశారు.

అయితే తెలంగాణ జనసేన నేతలు దీనిపై పవన్ కళ్యాణ్ తో చర్చించి నిర్ణయం చెబుతామని వీహెచ్ కు సూచించారు. మరి కాంగ్రెస్ కు మద్దతిచ్చే విషయంపై పవన్ కళ్యాణ్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

ఇటీవలే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమానికి పవన్ హాజరయ్యారు. వీహెచ్ తో కలిసి పోరాడారు. మరి కాంగ్రెస్ ప్రతిపాదనకు ఏం చేస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.

కేటీఆర్, కేసీఆర్ కు బాగా దగ్గరైన జనసేనాని పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్ కోరిన మద్దతుకు ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఆయన పలుమార్లు టీఆర్ఎస్ పాలనను మెచ్చుకున్న సందర్భాలున్నాయి. మరి ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు మద్దతిస్తాడా లేదా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News