కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు అనుకుంటూ ఆ కోటాలో ఎప్పట్నుంచో ఎంపీగా ఎన్నికవుతున్న రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తాజాగా కొత్త పని పెట్టుకున్నట్లున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్శిల తెలంగాణలో చేపట్టిన పరామర్శ యాత్రను ఈ ఎంపీగారు అడ్డుకుంటారట.
అదేంటి...ఆమె పర్యటిస్తే ఈయన గారికేం బాధ అనుకోకండి. తెలంగాణకు వైసీపీ శత్రువు అని గతంలో ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ ఇపుడు షర్మిల పర్యటనను అడ్డుకోవడం లేదని...అందుకే తాము అడ్డుకుంటున్నట్లు ప్రకటించారు. అసలు షర్మిల తెలంగాణలో పర్యటించడం వల్ల లాభం ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు.
మొత్తానికి రాజకీయాల్లో తెరమీద ఉండేందుకు ఏమేం చేయాలో హనుమంతన్నకు బాగా తెలుసు అని అంతా చర్చించుకుంటున్నారు.