విదేశాలకు వెళ్లే విద్యార్థుల‌కు వ్యాక్సినేష‌న్‌

Update: 2021-06-05 08:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ మ‌న దేశంపై ఎంత ప్ర‌భావం చూపిందో ప్ర‌పంచం మొత్తం చూసింది. అందుకే.. భార‌త్ నుంచి రాక‌పోక‌ల విష‌యంలో ఇప్ప‌టికీ ప‌లు దేశాలు సానుకూలంగా లేవు. కొన్ని దేశాలు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు జారీచేస్తుంటే.. మరికొన్ని దేశాలు మాత్రం ఇప్ప‌ట్లో త‌మ దేశానికి రావొద్ద‌ని క‌రాఖండిగా చెప్పేస్తున్నాయి. ఈ ప‌రిస్థితి సాధార‌ణ జ‌నాల విష‌యంలో ఎలా ఉన్నా.. విదేశాల్లో చ‌దువుకునే విద్యార్థుల ప‌రిస్థితి మాత్రం ఇబ్బందిక‌రంగా త‌యారైంది.

కొన్ని దేశాలు టీకా వేసుకుంటే త‌మ దేశానికి వ‌చ్చేందుకు అనుమ‌తిస్తామ‌ని చెబుతుండ‌గా.. మ‌రికొన్ని ఏదిప‌డితే అది వేసుకొని వ‌స్తే ఒప్పుకోబోమని ప్ర‌క‌టిస్తున్నాయి. ఇంకొన్ని అయితే.. టీకా వేసుకున్నా, లేకున్నా.. ఈ ఏడాది త‌మ దేశంలో అడుగు పెట్టొద్ద‌ని తెగేసి చెబుతున్నాయి. ఇలాంటి దేశాల్లో చ‌దువుకునే విద్యార్థుల‌కు ఆన్ లైన్ విద్య‌మాత్ర‌మే శ‌ర‌ణ్యం కానుంది. మిగిలిన దేశాల్లో చ‌దువుకునే విద్యార్థుల‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ల‌భించ‌డంతో.. అలాంటి వారికోసం దేశంలో స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ‌కు చెందిన విద్యార్థుల‌కు వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. విదేశాల్లో అడ్మిష‌న్ పొందిన ప‌త్రాలతోపాటు పాస్ పోర్టు, వీసా తెచ్చుకున్న వారికి వ్యాక్సిన్ ఇస్తామ‌ని చెబుతున్నారు అధికారులు. హైద‌రాబాద్ లోని నారాయ‌ణ‌గూడ ఐసీఎం లో వీరికి వ్యాక్సినేష‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు.
Tags:    

Similar News